RRR: ఐటెం సాంగ్ ఉందా మావా ?.. నెటిజన్ ప్రశ్నకు  కౌంటరిచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR: ఐటెం సాంగ్ ఉందా మావా ?.. నెటిజన్ ప్రశ్నకు  కౌంటరిచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 27, 2021 | 7:17 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్, హాలీవుడ్ భారీ తారగణంతో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ఆడియోన్స్ ఎక్సైట్ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా నాటు నాటు వీర నాటు పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇక నిన్న విడుదలైన జననీ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉందా మావా అని ఓ నెటిజన్ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన ఆర్ఆర్ఆర్ టీం… ఏ నువ్వు చేస్తావా అంటూ హిలేరియస్ రిప్లై ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ టీం ఇలా నెటిజన్స్ ట్వీట్లకు స్పందించడం మొదటి సారి కాదు. గతంలో కూడా అనేకసార్లు నెటిజన్స్ ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ట్వీట్..

ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా, చిత్రీకరణ ఆలస్యం కావడం లాంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.’

Also Read: Prabhas: హైదరాబాదీలకు శుభవార్త.. ప్రభాస్‌, నాగ అశ్విన్‌ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేయండి..

Bigg Boss 5 Telugu Promo: సిరి వదిలేస్తున్నావా ?.. ప్రియుడు శ్రీహాన్ మాటలకు బోరున ఏడ్చేసింది.. ప్రోమో.. 

ఇన్‏స్టాగ్రామ్‏లో ఐఫోన్ ట్రెండ్ మాములుగా లేదుగా.. తెగ అట్రాక్ట్ అవుతున్న సెలబ్రిటీస్.. వీడియోస్ వైరల్..