AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: హైదరాబాదీలకు శుభవార్త.. ప్రభాస్‌, నాగ అశ్విన్‌ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేయండి..

Prabhas: ప్రస్తుతం ప్రభాస్‌ ఒక పాన్‌ ఇండియా స్టార్‌, ఆ మాటకొస్తే ఇంటర్‌నేషన్‌ హీరో అని కూడా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ నటిస్తోన్న సినిమాలు..

Prabhas: హైదరాబాదీలకు శుభవార్త.. ప్రభాస్‌, నాగ అశ్విన్‌ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేయండి..
Prabhas Project K
Narender Vaitla
|

Updated on: Nov 27, 2021 | 7:04 PM

Share

Prabhas: ప్రస్తుతం ప్రభాస్‌ ఒక పాన్‌ ఇండియా స్టార్‌, ఆ మాటకొస్తే ఇంటర్‌నేషన్‌ హీరో అని కూడా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ నటిస్తోన్న సినిమాలు ఇతర దేశాల్లోనూ విడుదలవుతుండడమే దీనికి కారణం. అలాంటి పాపులర్‌ హీరో చిత్రంలో నటించే అవకాశం వస్తే ఎగిరి గంతులేస్తాం కదూ.. ప్రస్తుతం హైదరాబాద్‌ వాసులకు ఇలాంటి అవకాశమే దక్కనుంది. ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొనె నటించనుంది. ఇక అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటిస్తుండడంతో ఈ సినిమా షూటింగ్ మొదలవకముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

‘ప్రాజెక్ట్‌-కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. దీంతో నటీనటుల కోసం వేట మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో నటించడానికి నటీ, నటులు కావాలని చిత్ర యూనిట్‌ ఓ ప్రకటనను విడుదల చేసింది. వైజయంతీ మూవీస్‌ ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘హైదరాబాదీలు ఇప్పుడు మీ వంతు వచ్చింది. సిద్ధంగా ఉండండి’ అని రాసుకొచ్చారు.

ఇందులో భాగంగా 50-70 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీ, పురుషులను తీసుకోనున్నారు. అయితే హైదరాబాద్‌లో నివసించే వారికే ఈ అవకాశాన్ని కల్పించారు. ఆసక్తి ఉన్న వారు vymtalent@gmail.comకి ప్రొఫెల్‌తో పాటు ఆడిషన్‌ వీడియోను పంపించాలి చిత్ర యూనిట్‌ తెలిపింది. మరెందుకు ఆలస్యం ఈ అద్భుత అవకాశాన్ని మీరూ ఉపయోగించుకోండి మరి.

Also Read: Viral Video: వాహనాలను ఆపి మరీ బుజ్జి పిల్లిని రోడ్డుదాటించిన పోలీస్‌ !! వీడియో

Viral Video: పెళ్లి వేడుకలో అమ్మమ్మ డ్యాన్స్‌ అదరగొట్టేసిందిగా !! వీడియో

IIT Recruitment: ఖరగ్‌పూర్ ఐఐటీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?