AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu Promo: సిరి వదిలేస్తున్నావా ?.. ప్రియుడు శ్రీహాన్ మాటలకు బోరున ఏడ్చేసింది.. ప్రోమో.. 

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఇక ఈ వారం ఇంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలానే జరిగాయి. ఒక్కో కంటెంస్టెంట్

Bigg Boss 5 Telugu Promo: సిరి వదిలేస్తున్నావా ?.. ప్రియుడు శ్రీహాన్ మాటలకు బోరున ఏడ్చేసింది.. ప్రోమో.. 
Bigg Boss Promo
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2021 | 6:55 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఇక ఈ వారం ఇంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలానే జరిగాయి. ఒక్కో కంటెంస్టెంట్ ఫ్యామిలీ రావడం.. సలహాలు ఇవ్వడం.. సందడి చేయడంతో ఈ వారం మొత్తం సరదాగా సాగింది. అయితే సిరి తల్లి, షణ్ముఖ్ మదర్ చేసిన కామెంట్స్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే. వీరిద్దరి రిలేషన్ గురించి ఈసారి నాగ్ ఎలా స్పందిస్తారో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాటి ప్రోమో గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈరోజు బిగ్‏బాస్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహాకులు.

ఇక ఈరోజు ఇంట్లోకి వెళ్లిన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ను స్టేజ్ పైకి తీసుకువచ్చారు నాగ్. మొదటగా యాంకర్ రవి తల్లి స్టేజ్ పైకి వచ్చింది. ఇక తల్లిని చూడగానే రవి ఎమోషనల్ కాగా.. కన్నీళ్లు పెట్టుకోవద్దని.. నువ్వు బిగ్‏బాస్ కి రాజావి అంటూ రవిని మోటీవేట్ చేసింది. ఇక ఆ తర్వాత జబర్ధస్త్ అప్పారావు, సాయి లేఖ, అఖిల్, బిగ్‏బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ వచ్చి కంటెస్టెంట్స్ ను పలకరించారు.

ఇక చివరగా.. సిరి ప్రియుడు శ్రీహాన్ .. బిగ్‏బాస్ స్టేజ్ మీదికి రావడంతో సిరి ఎమోషనల్ అయ్యింది. శ్రీహాన్ రాగానే స్క్రీన్ పక్కకు వెళ్లి ముఖాన్ని దాచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అటు సిరిని చూడగానే శ్రీహాన్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇక చివరగా.. సిరి అని పిలుస్తూ… వదిలేస్తున్నావా ? అని అడగడంతో మరింత ఏడ్చేసింది సిరి. శ్రీహాన్, సిరిలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

ప్రోమో..

Also Read: Allu Arjun: బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? మల్టీ స్టారర్‌ చిత్రంతో ముంబయిలో పాగా వేయనున్నాడా..

ఇన్‏స్టాగ్రామ్‏లో ఐఫోన్ ట్రెండ్ మాములుగా లేదుగా.. తెగ అట్రాక్ట్ అవుతున్న సెలబ్రిటీస్.. వీడియోస్ వైరల్..

Disha Patani: సర్జరీతో ముఖం పాడు చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..