నెక్ట్స్ పీరియాడిక‌ల్ డ్రామా… ముగ్గురు హీరోయిన్ల‌తో శ‌ర్వానంద్…

నెక్ట్స్ పీరియాడిక‌ల్ డ్రామా... ముగ్గురు హీరోయిన్ల‌తో శ‌ర్వానంద్...

మొద‌ట చిన్న‌చిన్న‌ల పాత్ర‌లతో స్టార్ట్ చేసి..ఆ త‌ర్వాతి కాలంలో హీరోగా మారి..త‌న‌కంటూ సెప‌రేట్ ఐడెంటీని క్రియేట్ చేసుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు అత‌డి మార్కెట్ రేంజ్ వేరు. అత‌డి ఫ్యాన్ బేస్ వేరు. స్వ‌శ‌క్తితో పైకి వ‌చ్చిన ప్ర‌స్తుత హీరోల‌లో శ‌ర్వానంద్ ఒక‌రు. ప్రజంట్ ‘శ్రీకారం’ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు శ‌ర్వా. కరోనా ప్ర‌భావం ముగిసిన ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ‘శ్రీకారం’ ముగిసిన‌ త‌ర్వాత చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ మూవీ చేయ‌నున్నాడు. […]

Ram Naramaneni

|

May 10, 2020 | 4:39 PM

మొద‌ట చిన్న‌చిన్న‌ల పాత్ర‌లతో స్టార్ట్ చేసి..ఆ త‌ర్వాతి కాలంలో హీరోగా మారి..త‌న‌కంటూ సెప‌రేట్ ఐడెంటీని క్రియేట్ చేసుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు అత‌డి మార్కెట్ రేంజ్ వేరు. అత‌డి ఫ్యాన్ బేస్ వేరు. స్వ‌శ‌క్తితో పైకి వ‌చ్చిన ప్ర‌స్తుత హీరోల‌లో శ‌ర్వానంద్ ఒక‌రు. ప్రజంట్ ‘శ్రీకారం’ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు శ‌ర్వా. కరోనా ప్ర‌భావం ముగిసిన ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది.

‘శ్రీకారం’ ముగిసిన‌ త‌ర్వాత చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ మూవీ చేయ‌నున్నాడు. 1990-2021 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ డ్రామాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటార‌ని డైరెక్ట‌ర్ చందు మొండేటి ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదు.. ఈ మూవీలో శర్వానంద్ కొత్త తరహాలో కనిపిస్తాడని, అత‌డికి సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చే చిత్ర‌మిద‌ని చందు చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ‘కార్తికేయ 2’ సినిమాను పూర్తి చేస్తున్న చందు మొండేటి అది కంప్లీట్ అయిన అనంత‌రం శ‌ర్వానంద్ సినిమాపై ఫోక‌స్ పెడ‌తాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu