జగదేక వీరుడు-అతిలోక సుందరి సీక్వెల్ దర్శకుడిగా రాజమౌళి..!

జగదేక వీరుడు-అతిలోక సుందరి సీక్వెల్ దర్శకుడిగా రాజమౌళి..!

జగదేక వీరుడు- అతిలోక సుందరి సీక్వెల్.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో

TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2020 | 4:16 PM

జగదేక వీరుడు- అతిలోక సుందరి సీక్వెల్.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత అశ్వనీదత్.. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌ను నిర్మించిన తరువాతే రిటైర్మంట్ తీసుకుంటానని ప్రకటించడంతో.. సీక్వెల్‌పై మళ్లీ అంచనాలు మొదలయ్యాయి. మెగాస్టార్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటైన ఈ మూవీ సీక్వెల్‌లో రామ్ చరణ్‌ను హీరోగా చూడాలనుకుంటున్నానని చిరంజీవి చాలా సార్లు చెప్పారు. మరోవైపు హీరోయిన్‌గా శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం దూసుకుపోతుండగా.. ఆమెనే ఈ సీక్వెల్‌లో పెట్టాలని ఫ్యాన్స్‌ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదంతా పక్కనపెడితే ఈ సీక్వెల్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న ప్రశ్న అందరిలో మెదలుతోంది.

ఈ సినిమా సీక్వెల్‌పై అటు చిరు, ఇటు అశ్వనీదత్ తమ కోరికను చెబుతున్నప్పటికీ.. దర్శకధీరుడు రాఘవేంద్రరావు మాత్రం సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. అందులోనూ ఆయన కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రాఘవేంద్రరావు ఈ సీక్వెల్‌ను తెరకెక్కించడం కష్టమేనన్న టాక్‌ నడుస్తోంది. ఇక ఆయన వారసుడు ప్రకాష్‌ను పెట్టి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసే అవకాశం ఉన్నా.. ప్రకాష్‌ దర్శకుడిగా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈ క్రమంలో ఈ మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్‌ అందరూ రాజమౌళి నామాన్ని జపిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ వారసుడైన జక్కన్న మాత్రమే ఈ సీక్వెల్‌కు న్యాయం చేయగలరని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు కూడా ఈ లిస్ట్‌లో వినిపిస్తోంది. మరి ఈ సీక్వెల్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారు..? చెర్రీ, జాన్వీలు ఈ సీక్వెల్‌లో మెరవనున్నారా..? లాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Read This Story Also: మహేష్ డైలాగ్‌తో అదరగొట్టిన వార్నర్‌.. స్పందించిన పూరీ..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu