అకారణంగా నన్ను టార్గెట్ చేశారు.. సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్

అకారణంగా నన్ను టార్గెట్ చేశారు.. సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘గులాభి సినిమాలో ఈవేళలో నీవు ఏం చేస్తుంటావు..’ అనే పాటతో తన సినీ పయాణాన్ని మొదలు పెట్టిన సునీత.. అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే.. అటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా ‘తనని కారణం లేకుండా టార్గెట్ చేశారని’ ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘కనీస కారణం లేకుండానే […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2020 | 4:02 PM

ప్రముఖ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘గులాభి సినిమాలో ఈవేళలో నీవు ఏం చేస్తుంటావు..’ అనే పాటతో తన సినీ పయాణాన్ని మొదలు పెట్టిన సునీత.. అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే.. అటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు.

తాజాగా ‘తనని కారణం లేకుండా టార్గెట్ చేశారని’ ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘కనీస కారణం లేకుండానే అతి సులభంగా నన్ను టార్గెట్ చేసిన వారిని చూశాను. నా గురించి గాసిప్ చేయడానికి వాట్సాప్ గ్రూపులు సృష్టించబడటం నేను చూశాను. కొన్ని వెబ్‌సైట్లు నా గురించి అర్థంపర్థంలేనివి రాయడం నేను చూశాను. నా వ్యక్తిగత జీవితం గురించి మహిళలు పుకార్లు చేయడం కూడా నేను చూశాను. నా జీవితంలో విజయాలు, అపజయాలు చూశాను. మౌనంగా ఉంటూ జీవితానికి సరిపడా చేసేశా. పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కొంటూ.. ఒంటరిగా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు. మొత్తానికి నేను జీవితాన్ని చూశాను. ఇవన్నీ నా జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి’. అని సునీత ఫేస్‌బుక్ పోస్టులో రాసి.. ఓ వీడియోను షేర్ చేశారు సునీత.

కాగా నా పుట్టిన రోజు సందర్భంగా నన్నెంతో అభిమానించేవారు నాకోసం ఇప్పుడు ఒక్కటయ్యారు. నా పని తీరును గుర్తు చేసి అభినందించారు. నా ఉనికికి కారణం చెప్పారు. వీరంతా కలిసి నా జీవితానికి మరింత అర్థం తెచ్చారు. మీ అందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు సునీత. కాగా ఆమె పోస్టుకు సెలబ్రిటీలు, నెజిటన్లు స్పందిస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. మీ నుంచి ఇంకా హిట్ పాటలు రావాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More:

ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..

గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో సినీ ప్రముఖులు

బ్రేకింగ్: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu