అభిమానికి క‌రోనా.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన స్టార్ హీరో..

అభిమానికి క‌రోనా.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన స్టార్ హీరో..

క‌రోనా క‌ల్లోలం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌పంచంలోని న‌లుమూల‌ల ఇప్పుడు ఈ మ‌హ‌మ్మారి గురించే చ‌ర్చ‌. ఇంకా వ్యాక్సిన్ గానీ, మెడిసిన్ కానీ అందుబాటులోకి రాక‌పోవ‌డంతో ప‌రిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. క‌రోనాకు తార‌త‌మ్యాలు లేవు. సామాన్యుల నుంచి అగ్ర‌దేశాల ప్ర‌ధాన‌మంత్రుల‌కు కూడా సోకింది ఈ డేంజ‌ర‌స్ వైరస్. తాజాగా త‌మిళ హీరో శింబు అభిమాని ఆనంద్‌కు క‌రోనా వైర‌స్ సోకింది. త‌న అభిమానికి కోవిడ్-19 పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలుసుకున్న శింబు అత‌నికి […]

Ram Naramaneni

| Edited By: Anil kumar poka

May 10, 2020 | 4:04 PM

క‌రోనా క‌ల్లోలం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌పంచంలోని న‌లుమూల‌ల ఇప్పుడు ఈ మ‌హ‌మ్మారి గురించే చ‌ర్చ‌. ఇంకా వ్యాక్సిన్ గానీ, మెడిసిన్ కానీ అందుబాటులోకి రాక‌పోవ‌డంతో ప‌రిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. క‌రోనాకు తార‌త‌మ్యాలు లేవు. సామాన్యుల నుంచి అగ్ర‌దేశాల ప్ర‌ధాన‌మంత్రుల‌కు కూడా సోకింది ఈ డేంజ‌ర‌స్ వైరస్. తాజాగా త‌మిళ హీరో శింబు అభిమాని ఆనంద్‌కు క‌రోనా వైర‌స్ సోకింది.

త‌న అభిమానికి కోవిడ్-19 పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలుసుకున్న శింబు అత‌నికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ధైర్యాన్ని కోల్పోవ‌ద్ద‌ని, అంతా మంచే జ‌రుగుతుంద‌ని భ‌రోసా ఇచ్చాడు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అభిమానుల వ‌ల‌నే తాను ఈ స్థాయికి వ‌చ్చానని. . సినిమాలు లేని స‌మ‌యంలో వారు వెన్నంటే ఉండి, త‌న‌కు ధైర్యాన్ని నూరిపోశార‌ని, ఆ ప్రేమే త‌న జీవితం ప్ర‌శాంతంగా ముందుకెళ్లేలా చేసింద‌ని వెల్ల‌డించారు శింబు‌. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `మానాడు` అనే మూవీలో న‌టిస్తున్నాడు శింబు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu