‘పుష్ప’ విషయంలో ప్లాన్ మార్చుకున్న సుకుమార్..!

'పుష్ప' విషయంలో ప్లాన్ మార్చుకున్న సుకుమార్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్కల మాస్టార్‌ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం 'పుష్ప'. బన్నీ-సుకుమార్ కాంబోకు తెలుగులో మంచి క్రేజ్‌ ఉండగా..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 11, 2020 | 2:57 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్కల మాస్టార్‌ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం ‘పుష్ప’. బన్నీ-సుకుమార్ కాంబోకు తెలుగులో మంచి క్రేజ్‌ ఉండగా.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూడో చిత్రానికి అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే మొదట ఈ మూవీ చిత్రీకరణలోని కొన్ని సీన్లను థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో తెరకెక్కించాలని సుకుమార్ భావించారు. కానీ అనుకోకుండా కరోనా రావడంతో ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఈ మహమ్మారి ప్రభావం సినిమా ఇండస్ట్రీపై కూడా భారీగా పడింది. ఈ క్రమంలో రాబోయే సినిమాలకు బడ్జెట్‌ను తగ్గించుకోవాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలోనే సుకుమార్‌ పుష్ప విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట.

దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఇండియాలోనే తీయాలని ఆయన భావిస్తున్నారట. అంతేకాదు అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ ఈ సినిమా కోసం తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Read This Story Also: భవిష్యత్‌లో నా పిల్లలకు తల్లి.. నయన్‌పై విఘ్నేష్‌ ఆసక్తికర కామెంట్లు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu