Guppedantha Manasu Rishi: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఆగిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన రిషి..

కానీ అదే సమయంలో ఉన్నట్లుండి ఈ సీరియల్ కు శుభం కార్డ్ వేసి ప్రేక్షకులకు షాకిచ్చారు దర్శకనిర్మాతలు అయితే రిషి, వసుధార బిగ్ బాస్ రియాల్టీ షోలోకి వెళ్తున్నారని.. అందుకే సీరియల్ ముగించారని అప్పట్లో టాక్ నడిచింది. కానీ బిగ్ బాస్ షో ప్రారంభమై రెండు వారాలు పూర్తైన ఇప్పటివరకు రిషి, వసుధార ఈ షోలోకి అడుగుపెట్టలేదు.

Guppedantha Manasu Rishi: 'గుప్పెడంత మనసు' సీరియల్ ఆగిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన రిషి..
Rishi
Follow us

|

Updated on: Sep 16, 2024 | 4:48 PM

బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ ద్వారా ఆ స్థాయిలో టీఆర్పీ సొంతం చేసుకుంది గుప్పెడంత మనసు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు మూడేన్నరేళ్లపాటు అగ్రస్థానంలో దూసుకుపోయిన ఈ సీరియల్.. ఆకస్మాత్తుగా శుభం కార్డు వేశారు. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. కొన్నాళ్లపాటు రిషి కనిపించకపోవడంతో మేకర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అడియన్స్. ఇక ఎట్టకేలకు రిషి పాత్రను మళ్లీ తీసుకువచ్చారు. దీంతో కథ ఆసక్తిగా మారింది. కానీ అదే సమయంలో ఉన్నట్లుండి ఈ సీరియల్ కు శుభం కార్డ్ వేసి ప్రేక్షకులకు షాకిచ్చారు దర్శకనిర్మాతలు అయితే రిషి, వసుధార బిగ్ బాస్ రియాల్టీ షోలోకి వెళ్తున్నారని.. అందుకే సీరియల్ ముగించారని అప్పట్లో టాక్ నడిచింది. కానీ బిగ్ బాస్ షో ప్రారంభమై రెండు వారాలు పూర్తైన ఇప్పటివరకు రిషి, వసుధార ఈ షోలోకి అడుగుపెట్టలేదు.

గుప్పెడంత మనసు సీరియల్ ను అర్ధాంతరంగా ఎందుకు ముగించారు అనేది ఇప్పటికీ క్లారిటీ రాని ప్రశ్న. అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్ ను ఉన్నట్లుండి ఎందుకు ఆపేశారు.. రిషిధారలను మిస్సవుతున్నామంటూ ఫ్యాన్స్ ఇప్పటికీ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ సీరియల్ స్టార్ట్ చేయాలని.. లేదా సెకండ్ పార్ట్ అంటూ కొనసాగించాలని నెట్టింట రిక్వెస్ట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుప్పెడంత మనసు సీరియల్ హఠాత్తుగా ముగించడంపై రిషి అలియాస్ ముఖేష్ గౌడ క్లారిటీ ఇచ్చాడు.

ఎంత మంచి కథనైనా ఓ టైమ్ వరకు చెబితేనే బాగుంటుందని.. ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని కథను సాగదీస్తే సీరియల్ విలువ పడిపోతుందని అన్నారు. గుప్పెడంత మనసు సీరియల్ తోపాటు రిషి, వసుధార పాత్రల పట్ల తెలుగు ప్రేక్షకులకు ఉన్న అభిమానం, ప్రేమతోపాటు విలువ కూడా తగ్గిపోకూడదనే సీరియల్ ను ముగించాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పటికే సీరియల్ స్టార్ట్ అయి మూడున్నరేళ్లు అవుతుందని.. ఇంకా కథను సాగదీయం మంచిది కాదనిపించిందని..అందుకే ముగించినట్లు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.