ఫేషియల్ కోసం వెళ్ళిన హీరోయిన్.. మరింత అందంగా మారుస్తానని చెప్పిన డాక్టర్.. చివరికి ఇలా.

ఫేషియల్ కోసం వెళ్ళిన హీరోయిన్.. మరింత అందంగా మారుస్తానని చెప్పిన డాక్టర్.. చివరికి ఇలా.
Raija

Raiza Wilson: హీరోయిన్ అంటేనే గ్లామర్. ఇక వారు అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిన విషయమే. ఫేషియల్స్‌ అని, సర్జరీలు

Rajitha Chanti

|

Apr 19, 2021 | 9:38 AM

Raiza Wilson: హీరోయిన్ అంటేనే గ్లామర్. ఇక వారు అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిన విషయమే. ఫేషియల్స్‌ అని, సర్జరీలు అని అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు నానాతంటాలు పడుతుంటారు. ఈ క్రమంలో ముఖం మీద చిన్న గీత పడినా విలవిల్లాడిపోతుంటారు.. ఇక ఎప్పుడూ ముఖాన్ని అలా ఖాళీగా వదిలేయకుండా.. కేర్ ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇటీవల ఫేషియల్ కోసం వెళ్ళిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. తన ముఖాన్ని మరింత అందంగా చేస్తామని చెప్పిన డాక్టర్.. ఉన్న సహజత్వా న్ని కాస్తా నాశనం చేసి.. ఆమెను మరింత అందవికారంగా మార్చింది.

Raija 1

కోలీవుడ్ నటి రైజా విల్ సన్ సాధారణ ఫేషియల కోసం ఓ క్లినిక్‏కు వెళ్ళింది. అక్కడ ఉన్న లేడీ డాక్టర్ ఆమె ముఖాన్ని మరింత అందంగా మారుస్తానంటూ బలవంతంగా ఆమెకు చర్మ చికిత్స చేసింది. దీంతో అది వికటింది ఆ నటి కంటి కింద వాచిపోయింది. ఇక అది కాస్తా ఉబ్బిపోయి ముఖారవిందాన్ని దెబ్బ తీస్తోంది. ఈ విషయాన్ని రైజా స్వయంగా వెల్లడించింది. “నాకు అవసరం లేకపోయినా డాక్టర్‌ భైరవి‌ నాకేదో ట్రై చేసింది. చివరికి ఫలితం ఇదిగో ఇలా వచ్చింది.. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు” అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో యాడ్‌ చేసింది. ‘డా.భైరవి తనదగ్గరకు వచ్చే కస్టమర్లపై వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ప్రయోగాలు చేస్తుంది’ అంటూ పలువురు నెటిజన్లు వాపోయారు. దీంతో తనలాంటి బాధితులు చాలామంది ఉన్నారని తెలిసి నటి షాక్‌కు గురైంది. రైజా2017లో వెలయ్యిలా పట్టధారి 2 సినిమాలో ఓ చిన్నపాత్రతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొంది. 2018లో ప్యార్ ప్రేమ్ కాదల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఈ సినిమాకు రైజా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘అలైస్’‌, ‘కాదలిక్క యారుమిల్లై’, ‘హ్యాష్‌ట్యాగ్‌ లవ్‌’ అనే సినిమాలు చేస్తోంది.

Also Read: Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..

అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu