Sudheer Babu: కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సుధీర్ బాబు.. తొలిసారి మెగాఫోన్ పట్టుకోనున్న కమెడియన్..
'శ్రీదేవి సోడా సెంటర్' తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న సుధీర్ బాబు కొత్త సినిమాను మొదలుపెట్టాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ దర్శకుడిగా
‘శ్రీదేవి సోడా సెంటర్’ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న సుధీర్ బాబు కొత్త సినిమాను మొదలుపెట్టాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది చిత్రబృందం. ఈ సందర్భంగా సెట్లోని ఒక వర్కింగ్ స్టిల్‌ను పంచుకుంటూ ‘మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
కాగా ఇందులో ఓ సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేలా కనిపించాడు సుధీర్ బాబు. తొలి షెడ్యూల్‌లో భాగంగా ప్రస్తుతం సుధీర్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. కాగా సుధీర్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ సినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫీ చేయనున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ఇతర తారగణం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
An Action Extravaganza loading! ???@isudheerbabu from the sets of @SVCLLP‘s #ProdNo5 ?️?
KICKSTARTED the 1st Schedule??
& Arriving in Never Before Multi-shaded Avatar⚡?#Sudheer15 @HARSHAzoomout @chaitanmusic @pgvinda #NarayanDasNarang #PuskurRamMohanRao pic.twitter.com/mZNtkn9QSX
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) December 27, 2021
Also Read: