Republic Movie: రిపబ్లిక్‌ సినిమా రాజకీయాలకు అతీతంగా అందరూ అనుభవించాల్సిన ప్రయాణం.. సింగర్‌ స్మిత మూవీ రివ్యూ.

Republic Movie: మెగా సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా, దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రిపబ్లిక్‌'. ఈ సినిమా నేడు (శుక్రవారం) విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇటు..

Republic Movie: రిపబ్లిక్‌ సినిమా రాజకీయాలకు అతీతంగా అందరూ అనుభవించాల్సిన ప్రయాణం.. సింగర్‌ స్మిత మూవీ రివ్యూ.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 01, 2021 | 7:27 AM

Republic Movie: మెగా సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా, దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్‌’. ఈ సినిమా నేడు (శుక్రవారం) విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీతో పాటు అటు తేజ్‌ అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడిన తేజ్‌ ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాకముందే విడుదలవుతోన్న చిత్రం కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్పెషల్‌ షోను మూవీ మేకర్స్‌ గురువారం రాత్రి నిర్వహించారు. ఈ స్పెషల్‌ చూసిన సెలబ్రిటీలు సినిమా గురించి సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పటికే ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్‌ పాపులర్ సింగర్‌ స్మిత కూడా సినిమాపై స్పందించారు.

గురువారం రాత్రి స్పెషల్‌ షో చూసిన తర్వాత స్మిత ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘రిపబ్లిక్‌ దేవకట్టా సరికొత్త ప్రస్థానం. రాత్రి ఈ సినిమా చూసిన తర్వాత నాకు మైండ్‌ బ్లోయింగ్‌లా అనిపించింది. రిపబ్లిక్‌ రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా. నాకు విపరీతంగా నచ్చింది, మీ స్పందన ఏంటో వినాలనుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ఇలా సెలబ్రిటీలు ఒక్కొక్కరూ ఈ సినిమాపై స్పందిస్తుండడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేష్‌ నటించిన విషయం తెలిసిందే. ఇందులో తేజ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు.

Also Read: Aishwarya Rajesh: క్యాజువల్ లుక్ తో కవ్విస్తున్న నాచురల్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్

Gangubai Kathiawadi: ‘మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై’…’ గంగూబాయి కతియావాడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Allu Aravind: టాలీవుడ్ కష్టాలు.. ప్రభుత్వ సాయంపై సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..