AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Panday: చలికి తట్టుకోలేకపోయిన ‘లైగర్’ బ్యూటీ.. యంగ్ హీరో చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

ఛప్పాక్' సినిమా తర్వాత దీపికా పదుకొణె (Deepika Padukone) పూర్తి స్థాయి పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గెహ్రయాన్’( Gehraiyaan).  సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chauturvedi) హీరోగా నటిస్తున్నాడు

Ananya Panday: చలికి తట్టుకోలేకపోయిన 'లైగర్' బ్యూటీ.. యంగ్ హీరో చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
Basha Shek
|

Updated on: Jan 26, 2022 | 10:49 AM

Share

‘ఛప్పాక్’ సినిమా తర్వాత దీపికా పదుకొణె (Deepika Padukone) పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ‘గెహ్రయాన్’( Gehraiyaan).  సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chauturvedi) హీరోగా నటిస్తున్నాడు. ‘ లైగర్’ భామ అనన్య పాండే(Ananya Panday) ప్రధాన పోషిస్తోంది.  శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై అలరిస్తోంది. కాగా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ లో ఈ సినిమా విడుదల కానుంది.  ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటోంది చిత్ర బృందం.

ఈ నేపథ్యంలో ముంబయిలోని ఓ హోటల్ లో మూవీ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం హీరో సిద్ధాంత్, అనన్యా పాండే బయటకు వచ్చారు. మీడియా కు స్టిల్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే  హోటల్  బయటకు వచ్చేటప్పుడు ఒంటిపై బ్లేజర్ తీసేసి కేవలం టాప్ తోనే వచ్చింది అనన్య. దీంతో అక్కడి చలికి తట్టుకోలేక వణికిపోయింది. ఆమె ఇబ్బందిని గమనించిన సిద్ధాంత్ వెంటనే బ్లేజర్ తీసుకొచ్చి స్వయంగా అనన్యకు తొడిగాడు.  దీంతో ఫొటోషూట్ సజావుగా జరిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు సిద్ధాంత్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ‘జెంటిల్ మేన్’,  ‘చాలా కేరింగ్’ అంటూ ఆ యంగ్ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై  మీరు కూడా ఓ లుక్కేయండి..

Also Read: Coronavirus: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..

Republic Day 2022: ఈ దేశభక్తి సినిమాలు చాలా ఫేమస్‌.. ఎన్నిసార్లు చూసినా మళ్లీ కొత్తగానే..?

Team India: గణతంత్రం రోజున కివీస్‌ను గడగడలాడించిన భారత్.. హిట్‌మ్యాన్‌ స్పీడ్‌కు తోడైన ధనాధన్ ధోనీ..!

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..