Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..

దేశంలో కరోనా (Corona Virus) కల్లోలం కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తోన్న కొత్త కేసులు (Daily Cases) నేడు మళ్లీ పెరిగాయి. 

Coronavirus: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..
Follow us
Basha Shek

|

Updated on: Jan 26, 2022 | 10:05 AM

దేశంలో కరోనా (Corona Virus) కల్లోలం కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తోన్న కొత్త కేసులు (Daily Cases) నేడు మళ్లీ పెరిగాయి.  కేంద్ర ఆరోగ్య శాఖ (Central Health Ministry) విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,85,914 మంది కరోనా బారిన పడ్డారు.  నిన్నటి కంటే 11.7 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు  4,00,85,116 మంది కరోనా బారిన పడ్డారు. కాగా  రోజూవారీ పాజిటివిటీ రేటు మళ్లీ  పైకి ఎగబాకింది.  ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 16. 16 శాతంగా ఉంది.  కాగా నిన్న మొత్తం 665 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య  4, 91, 127 కు చేరుకుంది.

ఇక గడిచిన 24 గంటల్లో 2,99,073 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  దీంతో  దేశవ్యాప్తంగా రికవరీ రేటు ప్రస్తుతం 93.23 శాతంగా ఉంది.  ప్రస్తుతం దేశంలో 22,23,018 క్రియాశీలక కేసులున్నాయి. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్  ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నిన్న మొత్తం 59,50,731 కరోనావైరస్ వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు  మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య  1,63,58,44,536కి కు చేరుకుంది.

Also Read: Petrol Diesel Price: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Viral Video: కదల్లేని రోగితో వ్యాయామం చేయించిన నర్సు.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..

IND vs WI: ఒత్తిడిలో 120 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ అతని స్పెషాలిటీ.. ఏ ప్లేస్‌లో వచ్చినా దబిడ దిబిడే: దినేష్ కార్తీక్