Petrol Diesel Price: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరలకు గత కొద్ది రోజులుగా బ్రేక్ పడింది. ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.  మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి.

Petrol Diesel Price: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Follow us

|

Updated on: Jan 26, 2022 | 7:14 PM

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరలకు గత కొద్ది రోజులుగా బ్రేక్ పడింది. ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.  మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి.   ఈక్రమంలో ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను బుధవారం (జనవరి 26) విడుదల చేసింది.  దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ ధరలను సవరిస్తాయి. మరి ఈరోజు (జనవరి26) ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతం భారతదేశంలో దాని అధిక ధరల ప్రభావం లేదు.  క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకు పెరుగుతోంది. ఆ కోణంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ప్రతిరోజూ పెంచవచ్చు. కానీ, ప్రస్తుతం దేశంలో అలాంటిదేమీ జరగడం లేదు. ఒకవైపు ముడిచమురు ధరలు పెరుగుతూన్నా  మరోవైపు సుమారు మూడు నెలలకు పైగా పైగా దేశంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.94గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.29గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.66గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20ఉండగా.. డీజిల్ ధర రూ.94. 62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.18గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.90లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.97గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.22గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.51లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.59లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.27 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

Also Read: Viral Video: కదల్లేని రోగితో వ్యాయామం చేయించిన నర్సు.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..

Lahari Shari: లగ్జరీ బైక్ ను కొనుగోలు చేసిన లహరి.. ధర ఎంతో తెలుసా?

Ashu Reddy: జూనియర్ సామ్ వెనకనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?