Viral Video: కదల్లేని రోగితో వ్యాయామం చేయించిన నర్సు.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..

'రోగిని ప్రేమించలేని  డాక్టర్ (Doctor) కూడా రోగితోనే సమానం' అని శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో (cinema)  మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్.

Viral Video: కదల్లేని రోగితో  వ్యాయామం చేయించిన నర్సు.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..
Follow us
Basha Shek

|

Updated on: Jan 26, 2022 | 8:23 AM

‘రోగిని ప్రేమించలేని  డాక్టర్ (Doctor) కూడా రోగితోనే సమానం’ అని శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో (cinema)  మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్.  అందుకు  తగ్గట్లే రోగులు తమ బాధను మర్చిపోయేలా డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడమో లేదా ప్రత్యేకంగా  మానసిక నిపుణుల  పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించడమో లాంటివి చేస్తుంటారు. ఈక్రమంలో పక్షవాతం బారిన పడిన ఓ రోగిలో నిరుత్సాహం పోగొట్టేందుకు ఓ నర్సు డ్యాన్స్ చేసింది. దీంతో కదల్లేని స్థితిలో ఉన్నరోగి కూడా తన శరీరాన్ని కదిపేందుకు ప్రయత్నించాడు. దీనికి  సంబంధించిన వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వారికి థ్యాంక్స్ చిన్నపదం.. 

సాధారణంగా పక్షవాతం బారిన పడిన రోగులకు కొన్ని రకాల ఫిజియోథెరపీ వ్యాయామాలు చేపిస్తారు. ఇందులో కూడా నర్సు అదే పని చేసింది. అయితే రెగ్యులర్ స్టైల్లో కాకుండా వినూత్న పద్ధతిలో..  రోగిలో నిరాశ నిస్పృహలను పోగొడుతూ  అతనికి కొన్ని డ్యాన్స్ స్టెప్పులను చూపించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట కూడా వినిపిస్తుంటుంది. కాగా నర్సు డ్యాన్స్ చేయడం చూసి మంచం మీద ఉన్న రోగి కూడా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు.  నర్సు స్టెప్పులను అనుకరించడానికి ప్రయత్నించాడు. అలా సాగుతుండగానే చేతి కదలికలను సంబంధించిన వ్యాయామాలను రోగితో చేయిస్తుంది నర్సు.  కాగా అప్పటివరకు మంచం మీద నిరాశగా ఉన్న రోగి ముఖంలో నవ్వు వస్తుంది. తనకు తెలియకుండానే చచ్చుబడిపోయిన శరీర అవయవాలను కదిపేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ సర్వీస్ అధికారి దీపాంషు కబ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సాధారణంగా రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అక్కడ పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ‘థ్యాంక్స్ ‘ అని చెప్పి వెళ్లిపోతారు. కానీ వారి సేవకు అది చాలా చిన్నపదం’ అని దీపాంషు రాసుకొచ్చారు.

Also Read:Ashu Reddy: జూనియర్ సామ్ వెనకనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?

Lahari Shari: లగ్జరీ బైక్ ను కొనుగోలు చేసిన లహరి.. ధర ఎంతో తెలుసా?

Republic day 2022: రిపబ్లిడ్‌ డే శకటాలను ఎలా రూపొందిస్తారు? అసలు పరేడ్‌లో పాల్గొనే శకటాల ప్రక్రియ ఎంపికలో విధి విధానాలేంటంటే..