ప్రియురాలిని పెళ్లాడబోతున్న శర్వా!

టాలీవుడ్‌లోని హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచులర్ లైఫ్‌కి గుడ్‌బై చెబుతున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనే నిఖిల్‌, నితిన్‌, రానాలు పెళ్లి చేసుకొని

  • Tv9 Telugu
  • Publish Date - 2:08 pm, Mon, 24 August 20
ప్రియురాలిని పెళ్లాడబోతున్న శర్వా!

Sharwanad Marriage News: టాలీవుడ్‌లోని హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచులర్ లైఫ్‌కి గుడ్‌బై చెబుతున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనే నిఖిల్‌, నితిన్‌, రానాలు పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. విశేషమేంటంటే ఈ ముగ్గురు ప్రేమ వివాహాలనే చేసుకోవడం. ఇక ఈ లిస్ట్‌లో త్వరలో మరో యువ హీరో శర్వానంద్‌ చేరబోతున్నట్లు తెలుస్తోంది. తన చిన్ననాటి స్నేహితురాలిని శర్వా పెళ్లాడబోతున్నట్లు సమాచారం.

గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉండగా.. ఇటీవలే తమ తమ ఇళ్లలో ప్రేమ విషయాన్ని చెప్పారట. ఇక వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసిన ఇరు కుటుంబసభ్యులు, పెళ్లికి కూడా రెడీ అన్నారట. ఈ క్రమంలో త్వరలోనే ఎంగేజ్‌మెంట్ జరగనుందని, ఈ ఏడాది చివరి లోపు వీరిద్దరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. కాగా శర్వా ప్రేమించిన అమ్మాయి ప్రస్తుతం బిజినెస్ ఉమెన్‌గా మంచి పేరును సాధించినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. శర్వా స్పందించాల్సిందే.

కాగా మరోవైపు శర్వా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రంలో నటించనున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్‌లో ఓ మూవీకి, ఏసియన్ సినిమాస్ నిర్మాణంలో మరో మూవీలో ఈ హీరో నటించనున్నారు.

Read More:

పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌

ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.. రైతులకు మంత్రి భరోసా