సీబీఐ సమన్లు అందలేదు, రియా చక్రవర్తి లాయర్
సుశాంత్ కేసులో సీబీఐ నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి సమన్లు అందలేదని రియాచక్రవర్తి తరఫు లాయర్ తెలిపారు. తాము చట్టానికి అనుగుణంగా నడుచుకుంటామని...
సుశాంత్ కేసులో సీబీఐ నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి సమన్లు అందలేదని రియాచక్రవర్తి తరఫు లాయర్ తెలిపారు. తాము చట్టానికి అనుగుణంగా నడుచుకుంటామని, ఆ దర్యాప్తు సంస్థ ఎప్పుడు పిలిచినా హాజరవుతామని ఆయన చెప్పారు. లోగడ కూడా రియా, ఆమె కుటుంబ సభ్యులు ముంబై పోలీసుల ఎదుట, ఈడీ ముందు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో ఊహాగానాలు అనవసరమన్నారు. మరోవైపు-సీబీఐ వర్గాలు కూడా తాము రియాకు గానీ, ఆమె తండ్రికి గానీ సమన్లు పంపలేదని స్పష్టం చేశాయి.