AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు వాయిదాల ట్రెండ్.. ఆ స్టార్ హీరో మూవీ రిలీజ్ కూడా వాయిదా..!

ఏం రాస్తున్నామో.. ఏం తీస్తున్నామో ముందు దర్శకుడికి క్లారిటీ ఉండాలి. అది లేకపోతే ఇదిగో ఇలా వాయిదాలు పడుతూనే ఉంటాయి. అభిమాన హీరోల సినిమాలు మాటిమాటికి వాయిదా పడుతుంటే.. పాపం ఉక్రోశం ఆపుకోలేక ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Tollywood: మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు వాయిదాల ట్రెండ్.. ఆ స్టార్ హీరో మూవీ రిలీజ్ కూడా వాయిదా..!
Representative Image
Janardhan Veluru
|

Updated on: May 09, 2023 | 3:59 PM

Share

ఏం రాస్తున్నామో.. ఏం తీస్తున్నామో ముందు దర్శకుడికి క్లారిటీ ఉండాలి. అది లేకపోతే ఇదిగో ఇలా వాయిదాలు పడుతూనే ఉంటాయి. అభిమాన హీరోల సినిమాలు మాటిమాటికి వాయిదా పడుతుంటే.. పాపం ఉక్రోశం ఆపుకోలేక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు వాయిదా వేయకుండా మన డైరెక్టర్స్ సినిమాలు చేయలేరా..? కామన్ ఆడియన్ మనసులో ఉన్న బేసిక్ డౌట్ ఇది. దీనికి సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ మధ్య అనుకున్న టైమ్‌కు ఏ సినిమా కూడా రిలీజ్ కావట్లేదు.. కనీసం ఒకట్రెండు వాయిదాలు పడితే కానీ బెటర్ ఔట్ పుట్ ఇవ్వలేక తంటాలు పడుతున్నారు మేకర్స్. రాసుకున్న కథ సెట్స్‌పైకి వచ్చిన తర్వాత కూడా.. ఎప్పటికి పూర్తవుతుందో ఓ అంచనాకు రాలేకపోతున్నారు.

కోర్టులో కేసు విచారణ చాలాసార్లు వాయిదా పడినట్లుగా.. మన సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు దర్శకులు. తాజాగా తేజ సజ్జ నటిస్తున్న హనుమాన్ సినిమా మరోసారి వాయిదా పడింది. అదేంటని అడిగితే.. క్వాలిటీ ఔట్ పుట్ కోసం తప్పట్లేదంటున్నారు. అంటే కథ రాసుకునేటప్పుడు.. షూటింగ్ పూర్తయ్యాక కూడా ఔట్ పుట్‌పై మేకర్స్‌కు క్లారిటీ లేదా అనేది అర్థం కాని విషయం. ఆదిపురుష్‌కు కూడా ఇదే జరిగింది.

ఇవి కూడా చదవండి

స్క్రిప్ట్ ముందే పక్కాగా ఉండి.. ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే ఈ తిప్పలుండవు కదా అనేది విశ్లేషకుల వాదన. ఒక్కటో రెండో ఏమో అనుకోవచ్చు.. ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి మొదలుపెట్టి ఆదిపురుష్, హనుమాన్, ఏజెంట్, శాకుంతలం.. ఇలా వాయిదాల పర్వం చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. అట్లీ కుమార్, షారుక్ కాంబినేషన్‌లో వస్తున్న జవాన్ సైతం జూన్ 2 నుంచి వాయిదా పడింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తామని చెబుతున్నారు మేకర్స్..

జవాన్ మూవీ రిలీజ్ వాయిదా..

సినిమా సెట్స్‌పైకి వచ్చే ముందే వర్క్ షాప్ చేస్తే కంగారుండదని ఆ మధ్య చిరంజీవి చెప్పారు. వర్క్ షాప్ సంగతి దేవుడెరుగు.. ముందు కథ ఉండాలిగా.. అదే లేకుండా సినిమా స్టార్ట్ చేస్తున్నారని పివిపి, అనిల్ సుంకర లాంటి నిర్మాతలు అంటున్నారు. దర్శకులలో ఈ క్లారిటీ లేకే.. ఓవర్ బడ్జెట్‌లు, వరస వాయిదాలు పడుతున్నాయేమో అనిపిస్తుంది. మరి ఈ తీరు మారేదెప్పుడో..?

-ప్రవీణ్ కుమార్, టీవీ9 తెలుగు (ET Team)

మరిన్ని సినిమా వార్తలు చదవండి..