Raasi: ఆ సీన్ చేయడం ఇష్టం లేకనే బాలయ్య సినిమాకు నో చెప్పాను.. సమరసింహారెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..

Basha Shek

Basha Shek |

Updated on: Jan 15, 2022 | 3:07 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'సమర సింహారెడ్డి'.  90 వ దశకంలో వచ్చిన ఈ చిత్రం నందమూరి అభిమానులతో పాటు ప్రేకకులను కూడా బాగా ఆకట్టుకుంది

Raasi: ఆ సీన్ చేయడం ఇష్టం లేకనే బాలయ్య సినిమాకు నో చెప్పాను.. సమరసింహారెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..
Raasi

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సమర సింహారెడ్డి’.  90 వ దశకంలో వచ్చిన ఈ చిత్రం నందమూరి అభిమానులతో పాటు ప్రేకకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఒక రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాక్షన్‌ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు ఈ సినిమానే మొదలు అని చెప్పవచ్చు.  మాస్ డైరెక్టర్  బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి 1999లో సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ సాధించింది.  బాలయ్య నటనా విశ్వరూపానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. కాగా ఈ సినిమా విడుదలై  నిన్న( జనవరి 14) టితో  23 ఏళ్లు పూర్తయ్యాయి.  కాగా  ఈ హిట్‌ సినిమాపై సీనియర్‌ నటి, ఒకప్పటి ఫ్యామిలీ హీరోయిన్‌ రాశి గతంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అందుకే సిమ్రాన్ వచ్చింది..

‘సమర సింహారెడ్డి’  సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించారు. మెయిన్ హీరోయిన్ గా సిమ్రాన్ అభినయించగా   సంఘవి, అంజలా జవేరి కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈసినిమాలో మెయిన్ హీరోయిన్‌ సిమ్రన్ పాత్రలో రాశిని సంప్రదించారట దర్శక నిర్మాతలు.  ఇందులో భాగంగా దర్శకుడు  బి . గోపాల్ఆ మెను సంప్రదించి  కథ కూడా పూర్తిగా వివరించాడట. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశం నచ్చకపోవడంతో రాశి బాలయ్య సినిమాను వదులుకుంది. అదేంటంటే..  ఇందులో సీతాకోకచిలుకతో హీరోయిన్ సన్నివేశం ఒకటి ఉంటుంది. అయితే ఈ సీన్ చేయడానికి రాశి ససేమిరా అందట. దీంతో  దర్శకుడు నటి సిమ్రాన్‌ను కలిసి స్క్రిప్ట్‌ చెప్పాడట. ఆమెకు కథ నచ్చడం,  వెంటనే ఒకే చెప్పడంతో  రాశి స్థానంలో సిమ్రాన్ వచ్చి చేరింది. కాగా అప్పట్లో   బాలయ్య సినిమాను వదులుకోవడంతో  కొందరు ఆమెపై విమర్శలు కూడా చేశారని చెప్పుకొచ్చింది.  కాగా అదే ఏడాది ‘కృష్ణ బాబు’ చిత్రంలో బాలయ్యతో కలిసి  నటించింది రాశి. అయితే  ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. Also Read: S. Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తమన్.. అదేంటంటే..

HDFC FD: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అదిరిపోయే పండగ ఆఫర్‌.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు..!

Viral video: కంగనా బుగ్గల కంటే సున్నితమైన రోడ్లను నిర్మిస్తాం.. వైరల్ గా మారిన జార్ఖండ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu