నా బయోపిక్ తీస్తారా.. దమ్ముందా..?

తన బయోపిక్ తెరకెక్కించాలంటే ధైర్యం కావాలంటున్నారు సీనియర్ నటి జమున. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమున బయోపిక్ కూడా తీసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపించింది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన జమున.. తన బయోపిక్ తీయాలంటే చాలా ధైర్యం కావాలని అన్నారు. ‘‘ఎందుకంటే జమున అంటే పొగరుబోతని.., ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలను ఢీకొట్టిందని.., రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యిందని.., గృహణిగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:36 am, Thu, 9 May 19
నా బయోపిక్ తీస్తారా.. దమ్ముందా..?

తన బయోపిక్ తెరకెక్కించాలంటే ధైర్యం కావాలంటున్నారు సీనియర్ నటి జమున. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమున బయోపిక్ కూడా తీసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపించింది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన జమున.. తన బయోపిక్ తీయాలంటే చాలా ధైర్యం కావాలని అన్నారు.

‘‘ఎందుకంటే జమున అంటే పొగరుబోతని.., ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలను ఢీకొట్టిందని.., రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యిందని.., గృహణిగా మంచి జీవితాన్ని చూసిందని’’ ఆమె పేర్కొంది. ఇలా అన్ని కోణాల్లోనూ తాను ఒక చరిత్ర సృష్టించానని.. అలాంటి తన బయోపిక్ తీయడమంటే అది సాహసమే అవుతుందని ఆమె తెలిపింది. ఇక ఈ జనరేషన్‌లో తన పాత్రలో నటించే నటి కూడా దొరకడం కష్టమేనని జమున చెప్పుకొచ్చింది.