AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seerat Kapoor: బక్కిచిక్కిపోయిన బుజ్జిమా.. ఎందుకిలా తయారయ్యావంటూ ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..

శర్వానంద్‌ హీరోగా నటించిన 'రన్‌ రాజా రన్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సీరత్ కపూర్‌. అందులో 'బుజ్జిమా.. బుజ్జిమా' అనే పాట బాగా

Seerat Kapoor: బక్కిచిక్కిపోయిన బుజ్జిమా.. ఎందుకిలా తయారయ్యావంటూ ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..
Seerat Kapoor
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 07, 2022 | 7:21 AM

Share

శర్వానంద్‌ హీరోగా నటించిన ‘రన్‌ రాజా రన్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సీరత్ కపూర్‌. అందులో ‘బుజ్జిమా.. బుజ్జిమా’ అనే పాట బాగా ఫేమస్‌ అయ్యింది. కర్లీ హెయిర్‌, క్యూట్‌ లుక్స్‌తో కుర్రాళ్ల మదిని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ నటనతోనూ మెప్పించింది. ‘రన్‌ రాజా రన్‌’ తర్వాత ‘టైగర్’ ‘కొలంబస్‌’, ‘రాజుగారి గది 2’ ‘టచ్‌ చేసి చూడు’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఇందులో చాలావరకు సెకండ్‌ హీరోయిన్ పాత్రలు కావడంతో ఆశించిన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. కానీ ‘కృష్ణ అండ్‌ హిజ్ లీలా’, ‘మా వింత గాథ వినుమా’ వంటి ఓటీటీ సినిమాలతో డిజిటల్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ప్రస్తుతం సినిమాలకు అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను పంచుకుంటుంది.

మరీ ఇంత బక్కగానా?

ఈక్రమంలో తాజాగా షేర్‌ చేసిన ఓ ఫొటోలో మాత్రం గుట్టుపట్టలేనంతగా మారిపోయింది సీరత్‌. మొదటి సినిమా తర్వాత కొన్ని చిత్రాల్లో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు బక్కచిక్కిపోయి సైజ్‌ జీరోలా తయారైంది. దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘ఏమైంది నీకు ఇలా తయారయ్యావ్‌’, ‘లుక్ బాగానే ఉన్నా మరి ఇంత బక్కగానా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Also read:

IND vs SA: రెండో టెస్టులో టీమిండియా ఓటమి.. దక్షిణాఫ్రికాకు గెలిపించిన కెప్టెన్‌ ఎల్గర్‌.. సిరీస్‌ సమం..

PM Security Breach: ప్రధాని భద్రతా వైఫల్యంపై స్పందించిన నవీన్ పట్నాయక్‌.. ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదంటూ ట్వీట్‌..

Viral video: నీళ్లకు బదులు ఉమ్మితో హెయిర్‌ స్టైలింగ్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..