AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంజయ్ దత్ ధరించే కవచం బరువు 35కిలోలు

ప్రముఖ దర్శకుడు అశుతోష్ గొవారికల్ తెరకెక్కిస్తున్న చారిత్ర నేపథ్య చిత్రం పానిపట్. 1761లో మరాఠా మోధుడు సదాశివరావ్ భవ్ సైన్యానికి , ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీకి చెందిన సేనలకు మధ్య జరిగిన 3వ పానిపట్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సదాశివరావ్‌గా అర్జున్ కపూర్ నటిస్తుండగా, అహ్మద్ షా పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. సదాశివరావ్ భార్య పార్వతీబాయిగా కృతిసనన్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో రేఖ కనిపించనుంది. ఇందులో యుద్ధ సన్నివేశాలను […]

సంజయ్ దత్ ధరించే కవచం బరువు 35కిలోలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 12:17 PM

Share

ప్రముఖ దర్శకుడు అశుతోష్ గొవారికల్ తెరకెక్కిస్తున్న చారిత్ర నేపథ్య చిత్రం పానిపట్. 1761లో మరాఠా మోధుడు సదాశివరావ్ భవ్ సైన్యానికి , ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీకి చెందిన సేనలకు మధ్య జరిగిన 3వ పానిపట్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సదాశివరావ్‌గా అర్జున్ కపూర్ నటిస్తుండగా, అహ్మద్ షా పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. సదాశివరావ్ భార్య పార్వతీబాయిగా కృతిసనన్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో రేఖ కనిపించనుంది. ఇందులో యుద్ధ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

కాగా.. ఈ సినిమా కోసం వాడే కత్తి, డాలు, కవచం లాంటి వాటిని అచ్చం అప్పటి కాలం నాటి తరహాలోనే డిజైన్ చేశారు. సంజయ్ దత్ ధరించే కవచం బరువే సుమారు 35 కిలోలుందని సమాచారం. ఇందుకోసం సంజయ్ ధృడంగా కనిపించేందుకు జిమ్‌కు కూడా వెళ్తున్నాడంట.

Follow Us