AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vimanam Teaser: ఆకట్టుకుంటోన్న విమానం ప్రోమో.. తండ్రీకొడుకుల భావోద్వేగానికి ప్రేక్షకులు ఫిదా..

వెర్సటైల్ యాక్టర్‌ సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం విమానం. మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ చిత్రంలో సముద్ర ఖని వికలాంగుడి పాత్రలో కనిపించనున్నాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాలే ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ...

Vimanam Teaser: ఆకట్టుకుంటోన్న విమానం ప్రోమో.. తండ్రీకొడుకుల భావోద్వేగానికి ప్రేక్షకులు ఫిదా..
Vimanam
Narender Vaitla
|

Updated on: Apr 14, 2023 | 6:20 PM

Share

వెర్సటైల్ యాక్టర్‌ సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం విమానం. మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ చిత్రంలో సముద్ర ఖని వికలాంగుడి పాత్రలో కనిపించనున్నాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాలే ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. జూన్‌ 9వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ప్రోమో పేరుతో ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ప్రోమోను గమనిస్తే తండ్రీ కొడుకల మధ్య అనుబంధాన్ని ఎమోషనల్‌గా చూపించారు. భార్యలేకపోయినా కొడుకును జాగ్ర‌త్త‌గా చూసుకునే తండ్రి పాత్రలో సముద్ర ఖని అద్భుత నటనను కనబరిచారు. జీవితంలో ఎప్పటికైనా విమానం ఎక్కాలని ఆశపడే కుర్రాడికి, తండ్రికి మధ్య జరిగిన సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా అలనాటి అందాల తార మీరా జాస్మిన్‌ మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, ధన్‌రాజ్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రోమో విడుదల సందర్భంగా జీ స్టూడియోస్‌ సౌత్ మూవీస్ హెడ్ అక్ష‌య్ క్రేజీవాల్ మాట్లాడుతూ.. ‘కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌తో అసోసియేట్ కావ‌టం చాలా సంతోషంగా ఉంది. మా కాంబోలో మంచి న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ టీమ్‌గా ఏర్పడి భావోద్వేగాల క‌ల‌బోత‌గా బ‌ల‌మైన క‌థాంశంతో రూపొందిన విమానం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద’ని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా' ఫుడ్స్
ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా' ఫుడ్స్
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!
హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!
భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు
ఒకప్పుడు MBBS ఫెయిల్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు..
ఒకప్పుడు MBBS ఫెయిల్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు..