aha: ఆహా.. ఏం ఆఫర్ గురూ. రూ. 99కే మూడు నెలల ప్యాక్. పూర్తి వివరాలు..
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా దూసుకుపోతోంది. రోజురోజుకీ సబ్‌స్క్రైబర్‌లను పెంచుకూంటూ ఓటీటీ రంగంలో తనదైన మార్క్‌ను వేస్తోంది. సరికొత్త సినిమాలు, టాక్ షోలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో తాజాగా మరో సరికొత్త ప్యాక్ ను అందుబాటులోకి...
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా దూసుకుపోతోంది. రోజురోజుకీ సబ్‌స్క్రైబర్‌లను పెంచుకూంటూ ఓటీటీ రంగంలో తనదైన మార్క్‌ను వేస్తోంది. సరికొత్త సినిమాలు, టాక్ షోలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో తాజాగా మరో సరికొత్త ప్యాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.99 కే మొబైల్ ప్లాన్ ను అందిస్తోంది. దీనిద్వారా ఆహాలో ప్రసారమయ్యే అన్ని వినోద కార్యక్రమాలను వీక్షించవచ్చు. మొబైల్ వినియోగం రోజుకురోజుకు పెరుగుతోన్న తరుణంలో వినోద ప్రేమికులకు అత్యంత నాణ్యమైన ప్రాంతీయ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో ఆహా ఈ ప్యాక్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఆహాలో మొత్తం 2 వేల గంటలకు పైగా నిడివి కలిగిన కంటెంట్ 350 గంటలకు పైగా ఒరిజినల్ కంటెంట్ కలిగి ఉంది. ఆహా ఇప్పటివరకు 32 మిలియన్ల యాప్ డౌన్లోడ్స్, కోటీ ఇరవై లక్షల మంది యాక్టివ్ యూజర్స్ తో అత్యంత వేగంగా దూసుకుపోతుంది. ఈ రూ.99/- మొబైల్ ప్యాక్ ద్వారా యూజర్స్ తమ మొబైల్ ఫోన్స్ లో తెలుగు ఇండియన్ ఐడల్ 2, బాలయ్యబాబు అన్ స్టాపబుల్ 2, సరికొత్త న్యూసెన్స్ వెబ్ సిరీస్, ఇంటింటి రామాయణం, వినరో భాగ్యము విష్ణు కథ, దాస్ కా థమ్కీ వంటి మరెన్నో షోస్, సినిమాలు వీక్షించవచ్చు. అంతే కాక తెలుగులో డబ్ చేసిన కొరియన్ డ్రామా సిరీస్లు, గేమ్స్, డైలీ సిరీయల్స్ ఇంకా ఎన్నెన్నో వీనోద కార్యక్రమాలు చూస్తూ ఆనందివచ్చు.
ఈ స్పెషల్ ఆఫర్‌పై ఆహా సబ్ స్క్రిప్షన్, బిజినెస్ స్ట్రాటజీ హెడ్ రాకేష్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు అత్యంత నాణ్యమైన, ప్రాంతీయ వినోదాన్ని అందుబాటు ధరైన రూ.99/- కే అందించాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఆహా మరింత మందికి చేరువకావాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే ఇలాంటి ఆఫర్లు అందిస్తున్నాం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ వినోదాన్ని అందించడంలో ఆహా ఎప్పుడూ ముందే ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..