శ్రీవారిని దర్శించుకున్న నాగచైతన్య దంపతులు
సినీనటులు నాగచైతన్య, సమంత దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం నాగచైతన్య, సమంత దంపతులకు పండితులు వేదాశీర్వచనం, స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు. కాగా.. అలిపిరి నుంచి కాలిబాట మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు సమంత. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆమె కొండపైకి చేరుకుంది.