రజనీని సూపర్‌స్టార్ చేసిన దర్శకుడు ఇకలేరు
కోలీవుడ్ లెజండరీ దర్శకుడు జె. మహేంద్రన్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మహేంద్రన్ మరణ వార్తను ఆయన తనయుడు జాన్ మహేంద్రన్ వెల్లడించారు. దర్శకుడిగా కోలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్.. శంకర్, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులకు మార్గదర్శకుడిగా నిలిచారు. అంతేకాదు రజనీకి ఎన్నో హిట్లు ఇచ్చి ఆయనను సూపర్‌స్టార్‌గా మార్చారు. ఇక తన […]

కోలీవుడ్ లెజండరీ దర్శకుడు జె. మహేంద్రన్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మహేంద్రన్ మరణ వార్తను ఆయన తనయుడు జాన్ మహేంద్రన్ వెల్లడించారు. దర్శకుడిగా కోలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్.. శంకర్, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులకు మార్గదర్శకుడిగా నిలిచారు. అంతేకాదు రజనీకి ఎన్నో హిట్లు ఇచ్చి ఆయనను సూపర్‌స్టార్‌గా మార్చారు.
ఇక తన కెరీర్‌లో 80 సినిమాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్.. రెండు సార్లు జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. నటుడిగానూ ఆయన పలు చిత్రాలలో మెప్పించారు. ఇటీవల వచ్చిన ‘బ్యూమ్రాంగ్’లో చివరిసారిగా ఆయన కనిపించారు. మహేంద్రన్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. ఆయన మరణం కోలీవుడ్‌కు తీరని లోటు అని, మహేంద్రన్ ఆత్మకు శాంతి కలగాలంటూ పలువురు ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఆయన అంత్యక్రియలు జరగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.