Samantha: శాకుంతలం మూవీ నుంచి బిగ్ అప్‌డేట్.. ఆదిపురుష్ బాటలోనే ఈ సినిమా కూడా..
ప్రస్తుతం సినిమా మేకింగ్‌లో మార్పులు వచ్చేశాయ్. కథ కంటే కథనానికి, సినిమాను విజువల్‌గా చూపించే విధానంపై మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ గ్రాఫిక్స్‌తో సినిమాలను అత్యంతం ప్రాతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు...

ప్రస్తుతం సినిమా మేకింగ్‌లో మార్పులు వచ్చేశాయ్. కథ కంటే కథనానికి, సినిమాను విజువల్‌గా చూపించే విధానంపై మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ గ్రాఫిక్స్‌తో సినిమాలను అత్యంతం ప్రాతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ నటిస్తోన్న తాజాగా చిత్రం ఆదిపురుష్‌ను 3డీ వెర్షన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి సమంత నటిస్తోన్న శాకుంతలం కూడా వచ్చి చేరింది. గుణశేఖర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మహాభారతం ఇతివృత్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని 3డీ వెర్షన్‌లోనూ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ అధికారికంగా ట్వీట్ చేసింది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 3డీ పనులు కూడా పూర్తికాగానే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే శాకుంతలం 3డీలో విడుదలవుతోందని గతంలోనూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్ర యూనిట్ చేసిన ప్రకటనతో ఒక క్లారిటీ వచ్చేసింది.
#Shaakuntalam Also In 3D. A new release date will be announced soon! https://t.co/iFeTe4X60U@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #EpicLoveStory #MythologyforMilennials#Shaakuntalam3D pic.twitter.com/gAPy7InS5D
— Gunaa Teamworks (@GunaaTeamworks) November 4, 2022
ఇదిలా ఉంటే శాకుంతలం చిత్రానికి నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటిస్తుండగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సినిమా ఆయన కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..







