అమ్మను హత్తుకోవాలనిపించింది: అక్కినేని సమంత

చేస్తే మంచి సినిమాలు చేయాలి.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి అంటోది అక్కినేని కోడలు సమంత. నటిగా రిటైర్మెంట్ తీసుకునేలోపు ఫుల్‌లెన్త్ కామెడీ సినిమా చేయగలనా లేదా అన్న బాధ ఉండేది. ఓ బేబీ సినిమాతో ఆ బాధ తీరిందని చెబుతోంది. తన కెరీర్‌కు ఇది ప్రత్యేకమైన మూవీ అంటోంది సమంత. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత కీలకపాత్ర పోషించారు. డి.సురేష్‌బాబు, తాటి సునీత నిర్మాతలుగా వ్యవహరించారు. ఓ మీడియా సమావేశంలో సమంత మాట్లాడుతూ కొరియన్ […]

  • Anil kumar poka
  • Publish Date - 11:38 am, Fri, 7 June 19
అమ్మను హత్తుకోవాలనిపించింది: అక్కినేని సమంత

చేస్తే మంచి సినిమాలు చేయాలి.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి అంటోది అక్కినేని కోడలు సమంత. నటిగా రిటైర్మెంట్ తీసుకునేలోపు ఫుల్‌లెన్త్ కామెడీ సినిమా చేయగలనా లేదా అన్న బాధ ఉండేది. ఓ బేబీ సినిమాతో ఆ బాధ తీరిందని చెబుతోంది. తన కెరీర్‌కు ఇది ప్రత్యేకమైన మూవీ అంటోంది సమంత. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత కీలకపాత్ర పోషించారు. డి.సురేష్‌బాబు, తాటి సునీత నిర్మాతలుగా వ్యవహరించారు. ఓ మీడియా సమావేశంలో సమంత మాట్లాడుతూ కొరియన్ వెర్షన్ సినిమా చూసిన వెంటనే మా అమ్మను హత్తుకోవాలనిపించిందని చెప్పారు. వినోదం మాత్రమే కాకుండా అంత ఎమోషనల్ జర్నీ ఉన్న సినిమా ఇది అన్నారు. సినిమా ఎలా వచ్చిందని సురేశ్‌గారు అడిగిన వెంటనే పదిసార్లు డబ్బింగ్ థియేటర్‌కి వెళ్లి చూసుకున్నానంటోంది సమంత. ఈ సినిమా నాకెంతో నేర్పించిందని చెప్పింది. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు బ్యాక్‌బోన్ అవుతుందంటూ ఓ చిన్న నవ్వు నవ్వారు. మూవీ ఒరిజినల్ వెర్షన్ మీద గౌరవంతో చాలా జాగ్రత్తగా పనిచేశామని చెప్పారు. ఇక ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ఎక్కువ షేడ్స్ ఉన్న సినిమా ఇది అని చెప్పారు. జూలై 5న సినిమాను విడుదల చేస్తామని నిర్మాత డి. సురేశ్‌బాబు చెప్పారు.