Samantha Ruth Prabhu: సినీ రంగంలో ధ్రువతార.. సమంత పుట్టిన రోజు నేడు..
స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారనుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన సమంత.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు. సమంత అందానికి, నటనకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ నటిస్తూ మెప్పిస్తుంది. సిటాడెల్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సమంత.. ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా సమంతకు అభిమానులు, సినీ సెలబ్రెటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఏమాయ చేశావే అంటూ తెలుగు ప్రేక్షకులను తన నటనతో మాయ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత దూకుడు పెంచింది.
ఇది కూడా చదవండి : ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో.. ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యింది.. కానీ ఇప్పుడు
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ బిగినింగ్ లోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమా చేసి మెప్పించింది. సమంత ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అత్తారింటింకి దారేది.. రామయ్య వస్తావయ్యా, రభస, అఆ, మహానటి, యూటర్న్, ఓబేబీ, జాను వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసిన సమంత.. ఆ సమయంలోనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది.
ఇది కూడా చదవండి :ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఓవైపు తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నీదానే ఎన్ పొన్వసంతం సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది సామ్. ఇక హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్‌లో రాజీ పాత్రలో నటించి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీగా మారింది. వ్యక్తిగత జీవితంలోనూ సామ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత.. ఆమె మాయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిందే.. ఆ అనారోగ్య సమస్యను దైర్యంగా ఎదుర్కొని ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది సామ్.
ఇది కూడా చదవండి :ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే నేను పడిపోయా.. నాని ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




