రానా నక్సలైట్ టీం రెడీ.. జూన్‌లో సెట్స్ పైకి
దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోయే చిత్రం ‘విరాటపర్వం 1992’. ఈ సినిమాకు వేణు ఉడుగుల డైరెక్టర్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 1980’s పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో రానా స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తుండగా.. సాయి పల్లవి నక్సలైట్ పాత్ర పోషించనుంది. టబు, ప్రియమణి, జరీనా వాహబ్, ప్రియదర్శి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ప్రముఖ […]

దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోయే చిత్రం ‘విరాటపర్వం 1992’. ఈ సినిమాకు వేణు ఉడుగుల డైరెక్టర్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 1980’s పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో రానా స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తుండగా.. సాయి పల్లవి నక్సలైట్ పాత్ర పోషించనుంది.
టబు, ప్రియమణి, జరీనా వాహబ్, ప్రియదర్శి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనున్నారు.




