అమ్మకు క్యాన్సర్ అంటే వినరే.. నిత్యామీనన్ ఆవేదన.!

అందంతో పాటు ప్రతిభ ఉన్న నటి నిత్యా మీనన్. తన ప్రతిభతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉన్న నిత్య కేవలం ప్రతిభతోనే అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. అలాంటిది ఈమెపై కొద్దిరోజులుగా మలయాళ నిర్మాతలు విమర్శలు చేస్తున్నారు. తానొక పెద్ద స్టార్ అని ఫీలవుతూ నిర్మాతలను, దర్శకులను గౌరవించదని.. ఇబ్బందిపెడుతుందని ఆ మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. కొద్ది రోజులుగా మలయాళ నిర్మాతలు నిత్యామీనన్ ను కలవాలని ప్రయత్నించగా.. ఆమె కనీసం మాట్లాడేందుకు కూడా […]

  • Ravi Kiran
  • Publish Date - 2:24 pm, Wed, 1 May 19
అమ్మకు క్యాన్సర్ అంటే వినరే.. నిత్యామీనన్ ఆవేదన.!

అందంతో పాటు ప్రతిభ ఉన్న నటి నిత్యా మీనన్. తన ప్రతిభతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉన్న నిత్య కేవలం ప్రతిభతోనే అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. అలాంటిది ఈమెపై కొద్దిరోజులుగా మలయాళ నిర్మాతలు విమర్శలు చేస్తున్నారు. తానొక పెద్ద స్టార్ అని ఫీలవుతూ నిర్మాతలను, దర్శకులను గౌరవించదని.. ఇబ్బందిపెడుతుందని ఆ మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. కొద్ది రోజులుగా మలయాళ నిర్మాతలు నిత్యామీనన్ ను కలవాలని ప్రయత్నించగా.. ఆమె కనీసం మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించలేదని వారంటున్నారు. దానితో మలయాళ నిర్మాతలందరూ కూడా దీనిపై చర్చించి నిత్యామీనన్ ను బ్యాన్ చేయాలని ఆలోచనకు వచ్చారట. ఈ విషయం నిర్మాతల మండలిలో కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఎప్పుడూ కూడా విమర్శల గురించి పట్టించుకోని నిత్యామీనన్.. వీరు చేస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చింది.

ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ఆ నిర్మాతలు నన్ను కలవడానికి వచ్చిన మాట వాస్తవం. కానీ ఆ సమయంలో నేను షూటింగ్ లో ఉన్నాను. అప్పుడు అమ్మ క్యాన్సర్‌తో కూడా బాధపడుతోంది. ఆ సమయంలో నేను నటించడమే కష్టం.. అలాంటిది వారితో నేను ఎలా మాట్లాడగలనంటూ ప్రశ్నించింది. నన్ను మలయాళ ఇండస్ట్రీ నుంచి దూరం చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేక నేను మానసికంగా కుంగిపోయాను అలాంటి సమయంలో సినిమాల గురించి చర్చించడం, మాట్లాడటంపై నేను పెద్దగా ఆసక్తి చూపించను. అందుకే నేను మాట్లాడలేక పోయాను. వారు నన్ను ఎంతగా టార్గెట్ చేసినా కూడా నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అంది. నిత్యామీనన్ తన పరిస్థితిని వివరించిన నేపథ్యంలో మలయాళ నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.