ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. దసరాకు టీజర్..!

టాలీవుడ్‌ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. దసరాకు టీజర్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 04, 2020 | 11:18 AM

RRR movie NTR: టాలీవుడ్‌ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే 70శాతం పూర్తి అయ్యింది. ఇక కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ రాగా.. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రీకరణను ప్రారంభించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ షూటింట్‌లో చెర్రీ చేరేందుకు మరింత సమయం పట్టనుండగా.. ఆ లోపు ఎన్టీఆర్, మిగిలిన వారిని పార్ట్‌లను పూర్తి చేయాలనుకుంటున్నారట.

కాగా ఈ ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ టీజర్‌ని ఆర్ఆర్‌ఆర్‌ టీమ్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ బర్త్‌డే రోజు ఓ స్పెషల్ టీజర్ వస్తుందని అందరూ భావించారు. అయితే సాంకేతిక కారణాల వలన ఎన్టీఆర్ టీజర్‌ని విడుదల చేయలేకపోయారు. కాగా ఈ టీజర్ తప్పకుండా వస్తుందని, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పెద్ద బహుమతిగా ఉండబోతుందని ఓ సందర్భంలో జక్కన్న వెల్లడించారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ టీజర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ రోజు సందర్భంగా ఎన్టీఆర్‌ స్పెషల్ టీజర్‌ని విడుదల చేయబోతున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ దసరా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పెద్ద పండుగలా మారనుంది. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌లో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.

Read More:

సాయి పల్లవితో అనిల్ లేడి ఓరియెంటెడ్‌ మూవీ..!

విజయవాడ మాంసం దుకాణాలపై కార్పొరేషన్ అధికారుల దాడులు