సాయి పల్లవితో అనిల్ లేడి ఓరియెంటెడ్ మూవీ..!
ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు విజయంతో వరుసగా ఐదో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి.
Sai Pallavi Anil Ravipudi: ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు విజయంతో వరుసగా ఐదో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్‌ని తెరకెక్కించాలని ఆయన అనుకున్నారు. అయితే ఈ సీక్వెల్‌లోనూ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించనుండగా.. వారిద్దరి డేట్లు అడ్జెస్ట్ అవ్వడం లేదని సమాచారం. ఈ క్రమంలో ఆ మధ్యలో మరో మూవీని తెరకెక్కించాలనుకుంటున్నారట అనిల్ రావిపూడి.
ఈ నేపథ్యంలో తన కమర్షియల్ పంథాను వదిలి ఓ లేడి ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌ని రాశారట అనిల్. దాన్ని టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవితో తీయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మలార్ బ్యూటీ ఓకే చెప్తే.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
కాగా మహేష్‌తో తాను తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు కోసం అనిల్, సాయి పల్లవిని సంప్రదించినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇందులో గ్లామర్ రోల్ కావడం, పెద్దగా పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో సాయి పల్లవి రిజెస్ట్ చేసినట్లు గాపిప్‌లు వినిపించాయి. మరి ఈ సారి అనిల్ రాసిన లేడి ఓరియెంటెడ్ స్టోరీకి సాయి పల్లవి ఓకే చెప్తుందా..? ఇందులో నిజమెంత..? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే మరోవైపు ప్రస్తుతం సాయి పల్లవి, రానా సరసన విరాట పర్వం.. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీలో నటిస్తున్నారు. అలాగే శర్వానంద్‌తో కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న మూవీలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరికొందరు దర్శకులు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Read More: