AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: అప్పుడే మొదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ ఫీవర్‌.. అమెరికాలో ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

RRR: రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా (Ramcharan,NTR), రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ, ఆ మాటకొస్తే ఇతర దేశాలకు చెందిన వారు కూడా..

RRR: అప్పుడే మొదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ ఫీవర్‌.. అమెరికాలో ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Rrr Movie
Narender Vaitla
|

Updated on: Mar 06, 2022 | 6:50 AM

Share

RRR: రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా (Ramcharan,NTR), రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ, ఆ మాటకొస్తే ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాహుబలిలాంటి సెన్సేషన్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఫీవర్‌ ఇప్పడే మొదలైంది.

మరీ ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ హంగామా అప్పుడే మొదలైంది. అమెరికాలోని థియేటర్లలో ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమయ్యాయి. దీంతో ప్రేక్షకులు ఎగబడి టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని ఎన్టీఆర్‌ అభిమాని ఒకరు ఏకంగా 75 టికెట్లు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. డల్లాస్‌ నగరంలోని గ్యాలక్సీ థియేటర్‌లో మొత్తం 75 టికెట్లను కొనుగోలు చేయడం విశేషం. ఆ టికెట్లన్నంటినీ ఒక చోట చేర్చి తీసిన ఫోటోను ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పడానికి ఇది సాక్ష్యంగా నిలుస్తోంది.

ఇక డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమ్రుం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్‌ చరణ్‌ అల్లూరి పాత్రలో కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో తెలియాలంటే మార్చి 25 వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Beard Itching: గడ్డం దురదగా ఉంటుందా.. మీరు ఈ తప్పులు చేస్తున్నారని అర్థం..!

Darja Movie: యాక్షన్ కింగ్ రిలీజ్ చేసిన సునీల్ సినిమా మోషన్ పోస్టర్..

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.. ఆలూకర్రీలో ప్రత్యక్షమైన కప్ప.. ఆగ్రహంతో విద్యార్థులు ఏం చేశారంటే

Follow Us
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా