Sandeep Reddy: సందీప్ వంగా డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్.. ఇక దుమ్ము దుమారమే బాసూ..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తనదైన మార్క్ క్రియేట్ చేశాడు. ఆయన సినిమాలకు ఓవైపు విమర్శలు వచ్చినప్పటికీ యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఈ పాన్ ఇండియా స్టార్ హీరో సందీప్ డైరెక్షనలో పనిచేయాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

Sandeep Reddy: సందీప్ వంగా డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్.. ఇక దుమ్ము దుమారమే బాసూ..
Sandeep Vanga
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 20, 2024 | 5:14 PM

అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాస్, యాక్షన్, రొమాంటిక్, లవ్ ఇలా అన్ని ఎమోషన్స్ కలగలిపి యూత్ ఆకట్టుకునేలా సినిమాలను రూపొందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాడు. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ క్రేజ్ ఒక్కసారిగా మార్చేశారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ సైతం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ హీరోతో సందీప్ రెడ్డి సినిమా తీయబోతున్నారా ? అనే చర్చ మొదలైంది. అందుకు కారణం లేకపోలేదు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందామా.

కాంతార సినిమాతో ప్రపంచమే తనవైపు చూసేలా చేశాడు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. ఇన్నాళ్లుగా దర్శకుడిగా వెండితెరపై అద్భుతాలు సృష్టించిన రిషబ్.. ఇప్పుడు హీరోగా పాన్ ఇండియాను ఏలేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడలో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ తనకు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి పనిచేయాలని ఉందనే కోరికను వ్యక్తం చేశాడు. ‘ది రానా దగ్గుబాటి షో’లో రిషబ్ శెట్టి సందడి చేశారు. ఈ షోకు సంబంధించిన షూటింగ్ కుందాపూర్ లో జరిగినట్లుగా సమాచారం.

అయితే ఈ షోలో పాల్గొన్న రిషబ్ శెట్టి తన మనసులోని కోరికను బయటపెట్టాడు. “సందీప్ లాగా ఎవరూ ఆలోచించలేరు. ఒకసారి ఆలోచించిన తర్వాత మళ్లీ ఆలోచించలేరని నాకు అనిపిస్తుంది. ఆయన చేసే ఏ సినిమాలోనైనా నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.నాకు చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది. మా గ్రామం కెరడిలో, ఇక్కడి అడవిలో సినిమా షూట్ చేయాలని కలలు కన్నాను. నేను చాలా సినిమాల కోసం ఈ స్థలాన్ని ఉపయోగించాను. కానీ, అది సరిపోవడం లేదు. చివరికి కాంతారా సినిమా కథకు ఈ ప్రదేశం సరిపోయింది. గ్రామానికి చెందిన 700 మంది ఈ చిత్రానికి పనిచేశారు” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు