బన్నీ అలా చేయగానే ఫుల్‌గా భయపడిపోయాను: రష్మిక
23 December 2024
Basha Shek
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. పుష్ప 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టిందీ ముద్దుగుమ్మ.
డిసెంబర్ 05న విడుదలైన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. రికార్డు వసూళ్లు సాధిస్తోంది.
ఇక ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక అభినయం అదుర్స్ అని చెప్పవచ్చు. విమర్శకులు కూడా ఇదే చెబుతున్నారు.
సినిమా అంతా ఒకెత్తు అయితే.. జాతర సీన్ లో రష్మిక మందన్నా అభినయం నెక్ట్స్ లెవెల్ అని కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి
ఇక పీలింగ్స్ సినిమాలో రష్మిక స్టెప్పులు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయని సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్నా పుష్ప 2 లోని పీలింగ్స్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది
'సాధారణంగా నన్ను ఎవరైనా ఎత్తుకుంటే నాకు చాలా భయమేస్తుంది. పాటలో బన్నీ నన్ను ఎత్తుకున్నప్పుడు ఫుల్‌గా భయపడ్డాను'
' అయితే ఆ తర్వాత అంతా నార్మల్‌గా అనిపించింది. మొత్తం 5 రోజుల్లో ఈ పాట కంప్లీట్ చేసేశాము ’ అని రష్మిక చెప్పుకొచ్చింది.