Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renee Sen talks Mom Sushmita: షార్ట్ ఫిల్మ్ తో నటిగా మారిన మాజీ విశ్వసుందరి దత్త పుత్రిక.. అతని ప్రశంసల వర్షం

రెనీ మాట్లాడుతూ తన తల్లి సుస్మిత ..రోహ్మాన్‌ల గురించి పలు ఆసక్తి కరమైన విషయాలను తెలిపింది. తల్లి సుస్మితా సేన్ ప్రియుడు రోహ్మాన్ చాలా...

Renee Sen talks Mom Sushmita: షార్ట్ ఫిల్మ్ తో నటిగా మారిన మాజీ విశ్వసుందరి దత్త పుత్రిక.. అతని ప్రశంసల వర్షం
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2021 | 1:02 PM

Renee Sen talks Mom Sushmita: బాలీవుడ్ నటి మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూతురు రెనీ సేన్ సుత్తబాజీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రెనీ మాట్లాడుతూ తన తల్లి సుస్మిత ..రోహ్మాన్‌ల గురించి పలు ఆసక్తి కరమైన విషయాలను తెలిపింది. తల్లి సుస్మితా సేన్ ప్రియుడు రోహ్మాన్ చాలా మంచి వ్యక్తి అని తన నటనను చూసి రోహన్ గర్వపడుతున్నానని ప్రశంసించారంది. సుస్మితా సేన్ తన ఇద్దరు పెంపుడు కూతుళ్లు రెనీ, అలీసాతో కలిసి ముంబైలో ఉంటున్నారు. సుస్మిత చేరువైన రోహ్మాన్ కూడా కొద్ది నెలలుగా ఆ ఇంట్లోనే ఉంటుంన్నాడు. ఇటీవలే తమ సహజీవనం గురించి బయటపెట్టారు.

రోహ్మాన్ ఇప్పుడు మా జీవితంలో ఓ ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు.. అతనిని మేము నిజంగా చాలా ప్రేమిస్తున్నాము.. అతని నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాం.. ముఖ్యంగా కుటుంబ విలువలు, సంస్కృతి గురించి చాలా నేర్చుకుంటున్నాము. రోహ్మాన్ తమకు చాలా మద్దతుగా నిలబడతాడని చెప్పింది. కుటుంబ సభ్యులు నలుగురం ఎంతో సంతోషంగా జీవిస్తున్నామంది రెనీ సేన్.

ఇక తన తల్లి సుస్మిత కూడా సుత్తబాజీ ట్రైలర్ లో తన నటనను చూసి కన్నీటిపర్యంతమైందని రెనీ చెప్పింది. తన చెల్లి అలీసా కూడా చాలా సంతోష పడింది. అసలు తాను నటించాలని ఎప్పుడు అనుకోలేదని రెనీ సేన్ చెప్పింది. సుత్తబాజీ లో అనుకోకుండా అవకాశం వచ్చింది. దర్శకుడు కబీర్ ఖురానా తాను కలిసి చదువుకున్నామని.. ఓ రోజు ఆటను స్క్రిప్ట్ పంపించి దీనినిలో నటించడానికి మిమ్మల్ని ఆడిషన్ చేయాలని చెప్పాడు. స్క్రిప్ట్ చదివి తాను ఇష్టపడి ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించానని..  నటిగా మారడం వెనుక కారణాన్ని తెలిపింది. రెనీ సుష్మిత సేన్ పెద్ద కుమార్తె, ఆమెను 2000 లో అనంతరం అలీసాను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

AlsoRead: కార్తీక దీపం హీరోయిన్ వంటలక్క దీప రియల్ భర్త ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!