AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani Tuck Jagadeesh: కుటుంబంతో కలిసి పండుగ శుభాకాంక్షలు చెప్పిన టక్‌ జగదీష్‌… పేరు గుర్తిందిగా అంటూ..

Tuck Jagadeesh New Poster: 'జెర్సీ', 'గ్యాంగ్‌ లీడర్‌' సినిమాలో వరుస విజయాలను అందుకున్న నేచురల్‌ స్టార్ నాని 'వి' చిత్రంతో డిజిటల్‌ స్క్రీన్‌పై కూడా ప్రేక్షకులను..

Nani Tuck Jagadeesh: కుటుంబంతో కలిసి పండుగ శుభాకాంక్షలు చెప్పిన టక్‌ జగదీష్‌... పేరు గుర్తిందిగా అంటూ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 09, 2021 | 12:54 PM

Tuck Jagadeesh New Poster: ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలో వరుస విజయాలను అందుకున్న నేచురల్‌ స్టార్ నాని ‘వి’ చిత్రంతో డిజిటల్‌ స్క్రీన్‌పై కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ ఏడాది ‘టక్‌ జగదీష్‌’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడీ హీరో. తనకు ‘నిన్నుకోరి’ వంటి సూపర్‌ హిట్‌ విజయాన్ని అందించిన దర్శకుడు శివా నిర్వాణతో కలిసి చేతులు కలిపిన నాని భారీ హిట్‌పై కన్నేశాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌లుక్‌ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ‘టక్‌ జగదీష్‌’ చిత్ర యూనిట్‌ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టర్‌లో నానిని కుటుంబ సభ్యులంతా పెళ్లి కొడుకును చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇక ఇదే విషయాన్ని వివరిస్తూ నాని ట్విట్టర్‌ వేదికగా ‘టక్‌ జగదీష్‌’ కొత్త పోస్టర్‌తో పాటు.. ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏప్రిల్‌ 16, 2021. పేరు గుర్తుందిగా’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ నాని చేసిన ట్వీట్‌..

Also Read: Sharwanand: ‘శ్రీకారం’ నుంచి ‘సంక్రాంతి సందళ్లే’ ఫుల్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన శర్వానంద్ పాట..