Vantalakka Husband: కార్తీక దీపం హీరోయిన్ వంటలక్క దీప రియల్ భర్త ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
వంటలక్కగా అంత ఫేమ్ సంపాదించుకుంది కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్. తెలుగు ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఒక్కరికీ దీప గురించి తెలుసు.. అయితే ఆమె భర్త కూడా దేశ వ్యాప్తంగా..

Vantalakka Husband: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీక దీపం సీరియల్…. 900 ఎపిసోడ్స్ దాటిన ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.. ఇక వంటలక్క అనగానే వెంటనే కార్తీక దీపం సీరియల్ గుర్తుకొస్తుంది. దేశ విదేశాల్లో ఈ సీరియల్ కు ముఖ్యంగా దీపకు ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వంటలక్కగా అంత ఫేమ్ సంపాదించుకుంది కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్. తెలుగు ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఒక్కరికీ దీప గురించి తెలుసు.. అయితే ఆమె భర్త కూడా దేశ వ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి అనే విషయం కొంతమందికే తెలుసు.
అవును ప్రేమి విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందారు. తాను ఈ రోజు నటిగా ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం తన భర్త వినీత్ అని చెబుతారు ప్రేమి. అంతేకాదు ఆయన సహకారం లేకపోతే నటిగా జర్నీ కొనసాగేది కాదని అంటారు. దీపంగా తెలుగు, మళయాళంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక తెలుగులో వంటలక్కగా చేస్తున్న సందడితో.. కార్తీకదీపం సీరియల్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ ప్రోగ్రాం కు ధీటుగా రేటింగ్ సంపాదించుకుంది. ప్రతి వారం రేటింగ్స్ లో టాపర్ గా నిలుస్తుంది.
Also Read: మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ‘మిస్టర్ కూల్’.. ఇన్‌స్టాలో సందడి చేస్తోన్న ధోనీ..