Raviteja Krack Movie: ఆగిపోయిన ‘క్రాక్‌’ మార్నింగ్‌ షో.. నిర్మాత ఆర్థిక లావాదేవీలే కారణం..

Break For Crack Release: రవివేత, శృతి హాసన్‌ జంటగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'క్రాక్‌' సినిమా సంక్రాంతి కానుకగా శనివారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే..

Raviteja Krack Movie: ఆగిపోయిన 'క్రాక్‌' మార్నింగ్‌ షో.. నిర్మాత ఆర్థిక లావాదేవీలే కారణం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 09, 2021 | 11:11 AM

Break For Krack Release: రవివేత, శృతి హాసన్‌ జంటగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్‌’ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే తీరా సినిమా విడుదల సమయానికి బ్రేక్‌ పడింది. శనివారం క్రాక్‌ సినిమా మార్నింగ్‌ షో నిలిచిపోయింది. తమిళ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలే సినిమా నిలిచిపోవడానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ‘క్రాక్‌’ సినిమా నిర్మాత మధుపై గతంలో తమిళంలో విశాల్‌ హీరోగా తెరకెక్కిన ‘అయోధ్య’ చిత్రానికి సంబంధించి సుమారు రూ.10 కోట్ల ఆర్థిక లావాదేవీలపై కోర్టులో కేసు నడుస్తోందనీ తెలుస్తోంది. ఈ కారణంగా ప్రస్తుతం క్రాక్‌ విడుదలవుతోన్న నేపథ్యంలో చెన్నైకి చెందిన నిర్మాణ సంస్థ సినిమా విడుదలను అడ్డుకుందని సమాచారం. అయితే నిర్మాత మధు ఇప్పటికే సదరు నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతున్నాడని మరికొద్ది సేపట్లోనే సినిమా విడుదలకు క్లియరెన్స్‌ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామాని ఆశతో ఉన్న రవితేజ అభిమానులు ఈ వార్తతో నిరాశకు గురయ్యారు. ఇక వరుస పరాజయాల తర్వాత ఈసారైనా ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో రవితేజ క్రాక్‌ సినిమాకు ఓకే చెప్పాడు. నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

Also Read: Vantalakka Husband: కార్తీక దీపం హీరోయిన్ వంటలక్క దీప రియల్ భర్త ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!