సినిమాలు చేస్తానంటే నాకు సపోర్ట్ చేయడం లేదు.. షాకింగ్ విషయం బయట పెట్టిన జెనీలియా
బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయింది జెనీలియా డిసౌజా. అందులో అల్లరిపిల్లగా ఆమె అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. బొమ్మరిల్లుతో పాటు సాంబ, సై, మిస్టర్ మేధావి, రెడీ, ఢీ, హ్యాపీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార.

జెనీలియా.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. జానీలియా 2003లో హిందీ చిత్రం “తుఝే మేరీ కసమ్” సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో జెనిలియా రితేష్ దేశ్‌ముఖ్ సరసన నటించింది. అదే సంవత్సరంలో తమిళ చిత్రం “బాయ్స్”లో కూడా నటించింది. ఇదే సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. తెలుగులో స్ట్రయిట్ గా జెనీలియా మొదటి చిత్రం “సత్యం” ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత “సాంబ”, “నా అల్లుడు”, “సుభాష్ చంద్రబోస్”, “హ్యాపీ”, “బొమ్మరిల్లు”, “ఢీ”, “మిస్టర్ మేధావి”, “రెడీ”, “కథ”, “ఆరెంజ్”, “నా ఇష్టం” వంటి తెలుగు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. “బొమ్మరిల్లు” చిత్రం ఆమెకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఇందులో సిద్ధార్థ్ సరసన హాసిని పాత్రలో ఆమె నటన అభిమానులను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ సహజమైన నటన, ఆకర్షణీయమైన చిరునవ్వు జెనీలియా ప్రేక్షకులను దగ్గర చేశాయి.
జెనీలియా 2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. ఈ ఇద్దరూ కలిసి “తుఝే మేరీ కసమ్” సినిమా షూటింగ్ సమయంలో పరిచయమై, దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రియాన్ ,రాహుల్. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంది, కానీ 2022లో మరాఠీ చిత్రం “వేద్” ద్వారా తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రాన్ని రితేష్ దర్శకత్వం వహించగా, జెనీలియా నటించడమే కాకుండా నిర్మాణంలో కూడా భాగస్వామ్యం వహించింది.
జెనీలియా తన కమ్‌బ్యాక్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.. దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత సినిమాల్లోకి తిరిగి రావాలని చెప్పినప్పుడు, తనకు సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరని, చాలా మంది నిరుత్సాహపరిచారని ఆమె పేర్కొంది. అయినప్పటికీ, “వేద్” చిత్రంతో ఆమె విజయవంతంగా తిరిగి వచ్చింది. ఆమె ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితం, కుటుంబంతో గడిపే క్షణాలను అభిమానులతో పంచుకుంటోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.