Ram Red Movie: ఏడు భాషల్లో విడుదల కానున్న ‘రెడ్’ మూవీ.. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు
Ram's 'Red' Movie: హీరో రామ్ నటిస్తున్న 'రెడ్' చిత్రం ఏడు భాషల్లో విడుదల కాబోతోంది. శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని .....

Ram Red Movie: : హీరో రామ్ నటిస్తున్న ‘రెడ్’ చిత్రం ఏడు భాషల్లో విడుదల కాబోతోంది. శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, తమిళం, భోజ్‌పురితో పాటు హిందీలోకి ఈ సినిమాను అనువదించనున్నట్లు చెప్పారు. కన్నడ వెర్షన్ ఈనెల 14న విడుదల చేయనున్నామని, మిగతా భాషల్లో ఈనెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
అయితే వసూళ్ల గురించి పెద్దగా ఆలోచించకుండా ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ఓవర్సీస్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్‌లలో సినిమాను విడుదల చేస్తున్నామన్నారు. మర్డర్ మిస్టరీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా నటుడు రామ్ ద్విపాత్రరాభినయం చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Also Read:
Titanic movie: ‘టైటానిక్’ మూవీ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..