Chicken Prices Down: చికెన్ ధరలపై బర్డ్ ఫ్లూ ప్రభావం.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు..
Chicken Prices Down: బర్డ్ ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ ఇండస్ట్రీ కుదేలవుతోంది. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు...

Chicken Prices Down: బర్డ్ ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ ఇండస్ట్రీ కుదేలవుతోంది. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో మార్కెట్లో చికెన్ ధరలు ఒక్కసారిగా ఢమాల్ అయ్యాయి. మొన్నటి వరకు రూ. 250గా ఉన్న చికెన్ ధర.. ప్రస్తుతం రూ.180కి తగ్గింది.
ఇంకొన్ని రోజులు ఇదే పంధా కొనసాగితే రేట్లు మరింత పతనమైయ్యే పరిస్థితి ఉందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని.. పౌల్ట్రీ రైతులు నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు. కాగా, ఇప్పటి వరకు ఏపీలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాకపోయినా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. ప్రతి జిల్లాలోనూ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసిన పౌల్ట్రీల దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది.