అన్ని రంగాల్లో రాణిస్తున్న అతివలు.. తొలిసారిగా గూడ్సు రైలును పరుగులు పెట్టించిన మహిళా సిబ్బంది

ఇప్పటివరకు వివిధ పనులకే పరిమితమైన మహిళలు రైల్వే కో ఫైలట్‌గా సత్తా చాటుతున్నారు.

అన్ని రంగాల్లో రాణిస్తున్న అతివలు.. తొలిసారిగా గూడ్సు రైలును పరుగులు పెట్టించిన మహిళా సిబ్బంది
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 08, 2021 | 10:35 PM

సాధించాలన్న సంకల్పం ఉండాలి కానీ అన్నిరంగాల్లో రాణించవచ్చని మరోసారి నిరూపిస్తున్న అతివలు. తామేమీ తక్కువ కాము అంటూ మహిళలు సైతం అడుగులు వేశారు. ఇప్పటివరకు వివిధ పనులకే పరిమితమైన మహిళలు రైల్వే కో ఫైలట్‌గా సత్తా చాటుతున్నారు. పశ్చిమరైల్వేలో మొదటిసారి పూర్తిస్థాయిలో మహిళా సిబ్బంది గూడ్సు రైలును నడిపించారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్టు చేసి వారిని అభినందించారు.

మహరాష్ట్ర నుంచి గుజరాత్‌ వరకు నడిచిన ఈ గూడ్సు రైలును కుంకుమ్‌ డోంగ్రే, ఉదిత వర్మ, ఆకాంశరాయ్‌ నడిపారు. మహిళా సాధికారతకు ఇది ఒక కీలకమైన అడుగుగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ‘‘ మహరాష్ట్రలోని వసాయ్‌ రోడ్‌ నుంచి గుజరాత్‌లోని వడోదర వరకూ గూడ్సు రైలును సమర్థవంతంగా నడిపి, మా మహిళా సిబ్బంది సాధికారతకు ఉదాహరణగా నిలిచారు.’’ అని పీయూష్‌గోయల్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. తొలిసారిగా గూడ్సు రైలును పరుగులు పెట్టించిన మహిళా సిబ్బంది

ఈ రైలులో లోకోపైలట్‌ నుంచి గార్డ్‌ వరకూ మహిళలే ఉన్నారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలను ఆయన తన ఖాతాలో పోస్టు చేశారు. పశ్చిమ రైల్వే ప్రధాన పీఆర్ అధికారి సుమిత్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. సవాళ్లతో కూడుకున్న ఈ ఉద్యోగంలో ఎక్కువ దూరాలు ప్రయాణించేందుకు మహిళా ఉద్యోగులు ఇప్పటికీ వెనకడుగు వేస్తూనే ఉన్నారన్నారు. కానీ, ఈ గూడ్సు రైలును నడిపిన ముగ్గురు ఉద్యోగినులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. తొలిసారిగా గూడ్సు రైలును పరుగులు పెట్టించిన మహిళా సిబ్బంది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?