Hari Teja Baby Shower: వైభవంగా హరితేజ శ్రీమంతం వేడుక… వీడియో షేర్‌ చేసిన హిమజ..

Hari Teja Baby Shower Photos Viral: సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలు పెట్టి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి హరితేజ. ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన..

Hari Teja Baby Shower: వైభవంగా హరితేజ శ్రీమంతం వేడుక... వీడియో షేర్‌ చేసిన హిమజ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 09, 2021 | 1:52 PM

Hari Teja Baby Shower Photos Viral: సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలు పెట్టి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి హరితేజ. ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హరితేజ. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక అనంతరం ‘బిగ్‌బాస్‌1’తో మరింత క్రేజ్‌ సంపాదించుకున్న హరితేజ వరుస సినిమాలు, షోలతో దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే హరితేజ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలోనే తాజాగా కుటుంబ సభ్యులు హరితేజ శ్రీమంతాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సహనటి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. హిమజ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హిమజ పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో హరితేజ చిన్న స్టెప్‌ వేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్‌ చేస్తోంది.

హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో..

View this post on Instagram

A post shared by Himaja? (@itshimaja)

Also Read: కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ: నిమ్స్‌లో రూ.18 కోట్లతో అధునాతన టెక్నాలజీతో ‘మేఘా’ నిర్మించిన క్యాన్సర్ సెంటర్ అందుబాటులోకి