Khiladi: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఖిలాడి’.. రవితేజ సినిమా రన్ టైమ్ ఎంతంటే..
'క్రాక్' వంటి సూపర్‌హిట్ తర్వాత మాస్ మాహరాజా రవితేజ (Raviteja) నటిస్తోన్న చిత్రం' ఖిలాడి (Khiladi)'. ప్లే స్మార్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా అనసూయ కీలక పాత్ర పోషించనుంది.
‘క్రాక్’ వంటి సూపర్‌హిట్ తర్వాత మాస్ మాహరాజా రవితేజ (Raviteja) నటిస్తోన్న చిత్రం’ ఖిలాడి (Khiladi)’. ప్లే స్మార్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా అనసూయ కీలక పాత్ర పోషించనుంది. ‘రైడ్’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న రమేశ్ వర్మ (Ramesh Varma) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా హవీష్ ప్రొడక్షన్స్ అధినేత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అలాగే ఈ సినిమాకి మంచి రన్ టైమ్‌నూ కూడా ఫిక్స్ చేశారు.
కాగా ‘ఖిలాడి’ సినిమాకు సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. సినిమా నిడివిని 154 నిమిషాలకు సెట్ చేశారు. అంటే సరిగ్గా 2గంటల 34 నిమిషాలు. కాగా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, ఉన్నిముకుందన్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలలో నటించారు. కాగా ‘ఖిలాడి’ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో వెంటనే మన ముందుకు రానున్నాడు రవితేజ. మార్చి 25 లేదా ఏప్రిల్15 తేదీల్లో ఏదో ఒకరోజు ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. వీటితో పాటు ‘ధమాకా’, ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి.
With U/A & Run time of 154 Minutes #Khiladi ? is all set to PLAY SMART in Theatres from FEB 11th #KhiladiOnFeb11th ?
Mass Maharaj @RaviTeja_offl @DimpleHayathi @Meenakshiioffl @DirRameshVarma @ThisIsDSP @AstudiosLLP @PenMovies @adityamusic pic.twitter.com/Onz9d7FSUu
— BA Raju’s Team (@baraju_SuperHit) February 9, 2022
Numaish 2022: మళ్లీ ప్రారంభం కానున్న నుమాయిష్ ఎగ్జిబిషన్!.. ఎప్పటి నుంచంటే..
.