Ravanasura: రవితేజ రావణాసుర అంథెమ్ సాంగ్ విడుదల.. అమ్మాయిల వాయిస్‌కి ఫిదా అవ్వాల్సిందే..
రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం రావణాసుర. ధమాక వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ నుంచి వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు...
రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం రావణాసుర. ధమాక వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ నుంచి వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ తాజాగా సినిమా నుంచి అప్‌డేట్‌ను ఇచ్చింది.
రావణాసుర సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. రావణాసుర థీమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దశకంఠ లంకాపతి రావణా.. అంటూ సాగే ఈ పాట గూజ్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఇక ముఖ్యంగా సింగర్స్ పాటకు ప్రాణం పోశారు. శాంతి పీపుల్, నోవ్‌లిక్ పాటను ఆలపించిన విధానం ఆకట్టుకుంటోంది. అమ్మాయిల వాయిస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రావణాసుర ఆంథెమ్ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పించేలా సాగుతూ సినిమా కథ ఏంటన్నదానిపై ఆసక్తిని పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో టాలీవుడ్ యాక్టర్ సుశాంత్ విలన్‌గా నటిస్తున్న విషయంత ఎలిసిందే. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. మరి ధమాక తర్వాత వస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..