నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ రోడ్డు మార్గంలో అరుదైన దృశ్యం కనిపించింది. కవాల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన భారీ అడవి దున్న, సాధారణంగా దట్టమైన అడవిలో ఉండే బాహుబలి దున్న బయట కనిపించడంతో ప్రయాణికులు ఫోన్లలో చిత్రీకరించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి.