Balayya-Chiru: ఊచకోత కోసిన చిరు, బాలయ్య.. 25 రోజుల క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే

బాలయ్య, చిరు ఇద్దరూ తమ, తమ సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టేశారు. ఏరియాల వారిగా వసూళ్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి.

Balayya-Chiru: ఊచకోత కోసిన చిరు, బాలయ్య.. 25 రోజుల క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే
Konidela Chiranjeevi - Nandamuri Balakrishna
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 06, 2023 | 6:26 PM

సంక్రాంతికి వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి అంటూ వచ్చి గర్జించగా, చిరు వాల్తేరు వీరయ్యగా సరదాలు పంచారు. 2 సినిమాలు హిట్ టాక్ దక్కించుకున్నాయి. వీరసింహారెడ్డి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందింది. వాల్తేరు వీరయ్యలో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేశారు. ముఖ్యంగా మూవీలో వింటేజ్ చిరంజీవిని చూసి అభిమానులు సంబరపడ్డారు. ఈ మూవీస్ రిలీజయ్యి ఆల్మోస్ట్ 25 రోజులు అవుతుంది. ఇక కలెక్షన్స్ క్లోజ్ అయినట్లే లెక్క. ఇప్పటివరకు ఈ మూవీస్ ఎంత వసూలు చేశాయో ఓ లుక్ వేద్దాం పదండి.

‘వాల్తేరు వీరయ్య’ 24 రోజుల కలెక్షన్స్

  •  నైజాం : రూ. 35.82 కోట్లు
  • సీడెడ్ : రూ. 18.09 కోట్లు
  • ఉత్తరాంధ్ర:  రూ. 19.06 కోట్లు
  • ఈస్ట్​ గోదావరి :  రూ. 12.90 కోట్లు
  • వెస్ట్ గోదావరి : రూ. 7.08 కోట్లు
  • గుంటూరు : రూ. 9.11 కోట్లు
  • కృష్ణ : రూ. 7.66 కోట్లు
  • నెల్లూరు  :  రూ. 4.57 కోట్లు

మొత్తంగా రూ. 114.39 షేర్, రూ. 185.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది ‘వాల్తేరు వీరయ్య’.  అటు రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సిస్‌లో కూడా మంచి వసూళ్లే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 135.77 కోట్ల షేర్.. రూ. 231.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ కుమ్మేశాడు వీరయ్య. సినిమాకు రూ. 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్​ రూ. 89 కోట్లు. షేర్ కలెక్షన్స్ రూ. 135 కోట్లు రావడం చేత.. రూ. 47 కోట్ల వరకు ప్రాఫిట్స్ సంపాదించుకుంది.

‘వీర సింహారెడ్డి’  25రోజుల కలెక్షన్లు.. 

  • నైజాం : రూ. 17.31కోట్లు
  • సీడెడ్ : రూ. 16.50 కోట్లు
  • ఉత్తరాంధ్ర : రూ.8.55 కోట్లు
  • ఈస్ట్ గోదావరి : రూ.6.60 కోట్లు
  • పశ్చిమ గోదావరి : రూ. 4.90 కోట్లు
  • గుంటూరు : రూ.7.42 కోట్లు
  • కృష్ణ : రూ. 4.73 కోట్లు
  • నెల్లూరు : రూ. 3.00 కోట్లు

2 తెలుగు స్టేట్స్‌లో కలిపి..  రూ. 69.01 కోట్ల షేర్..  రూ.112.25 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు వీరసింహారెడ్డి. రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లొ రూ. 5.77 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్‌గా 25 రోజులు కలిపి చూస్తే.. రూ. 79.63 కోట్లు షేర్ (రూ. 133.55 కోట్లు గ్రాస్) కలెక్షన్స్ వచ్చాయి. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. 5.63 కోట్ల లాభాలు అర్జించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.